గురువారం, 25 ఏప్రియల్ 2024
  1. వినోదం
  2. తెలుగు సినిమా
  3. కథనాలు
Written By CVR
Last Updated : గురువారం, 27 ఆగస్టు 2015 (12:53 IST)

'బాహుబలి' బాటలో 'రుద్రమదేవి’... భారీ రేటుకు హిందీ రైట్స్

గుణశేఖర్ దర్శకత్వంలో తొలి సారిగా ఇండియన్ ఫిలిం ఇండస్ట్రీలో రూపొందుతున్న హిస్టారిక్ మూవీ ‘రుద్రమదేవి’. ఈ చిత్రం విడుదల విషయంలో గుణశేఖర్ 'బాహుబలి' బాటలోనే పయనిస్తున్నట్టున్నారు. 'బాహుబలి' చిత్రం విడుదల చేసిన రీతిలోనే 'రుద్రమదేవి' సంబంధించిన ఫస్టలుక్ పోస్టర్లను కూడా వరుసగా ఒకొక్కటిగా విడుదల చేశారు.

ఈ చిత్రం షూటింగ్ పార్త్‌ ఎప్పుడూ పూర్తయినప్పటికీ గ్రాఫిక్ వర్క్ కారణంగా విడుదల వాయిదా పడుతూ వచ్చింది. ఇప్పుడు సెప్టెంబర్ 25న విడుదల చేసేందుకు సన్నాహాలు చేస్తున్నట్టు సమాచారం.
 
ఇప్పుడు తాజా సమాచారం ఏమిటంటే..  ప్రపంచవ్యాప్తంగా ‘రుద్రమదేవి’ హిందీ వెర్షన్ రైట్స్‌ని అభిషేక్ పిక్చర్స్, రిలయన్స్  ఎంటర్ టైన్మెంట్స్ వారు కలిసి సొంత౦ చేసుకున్నారు. ఇక ఈ డీల్‌ని వారు రూ.22 కోట్లకి సొంతం చేసుకున్నారు. ఇంతకుముందు ‘బాహుబలి’ హిందీ వెర్షన్ కూడా రూ.25 కోట్లకి అమ్ముడుపోయింది. ఇప్పుడు రుద్రమదేవి కూడా అదే దారిలో ఉంది. దీంతో బాహుబలి లాగానే రుద్రమదేవి కూడా భారీ హిట్‌ను సొంతం చేసుకోవడం ఖాయమంటున్నారు సినీ పండితులు.