శనివారం, 20 ఏప్రియల్ 2024
  1. వినోదం
  2. తెలుగు సినిమా
  3. కథనాలు
Written By selvi
Last Updated : గురువారం, 17 మే 2018 (18:13 IST)

సామి-2: చియాన్ విక్రమ్ స్టైల్ అదిరింది.. ఫస్టు లుక్ వీడియో మీ కోసం..

కోలీవుడ్ హీరో చియాన్ విక్ర‌మ్, త్రిష జంట‌గా న‌టించిన సామి సినిమా సంచలనం సృష్టించింది. బంపర్ హిట్ అయ్యింది. ఈ సినిమాకు ప్రస్తుతం సీక్వెల్ రానుంది. ఈ చిత్రంలో విక్రమ్ సరసన కీర్తి సురేష్ నటిస్తోంది. సామి

కోలీవుడ్ హీరో చియాన్ విక్ర‌మ్, త్రిష జంట‌గా న‌టించిన సామి సినిమా సంచలనం సృష్టించింది. బంపర్ హిట్ అయ్యింది. ఈ సినిమాకు ప్రస్తుతం సీక్వెల్ రానుంది. ఈ చిత్రంలో విక్రమ్ సరసన కీర్తి సురేష్ నటిస్తోంది. సామికి దర్శకత్వం వహించిన దర్శకుడు హరినే ఈ చిత్రానికి దర్శకత్వం వహిస్తున్నాడు. ఈ సినిమా నుంచి త్రిష తప్పుకుంది. తన పాత్రకు ప్రాధాన్యత లేకపోవడంతో ఈ సినిమా నుంచి తప్పుకున్నట్లు సమాచారం. 
 
ఇక సామి-2లో బాబి సింహా, ప్రభు, సూరి ముఖ్య పాత్రలు పోషించనున్నారు. శిబు థామీన్స్ నిర్మాణంలో సామి2 రూపొందనుంది. దేవి శ్రీప్రసాద్ చిత్రానికి సంగీతం అందించనున్నాడు. సినిమాటో గ్రాఫర్‌గా ప్రియన్, ప్రొడక్షన్ డిజైనర్‌గా మిలన్, స్టంట్ మాస్టర్‌గా కనల్ కన్నన్ సామి-2 కోసం పనిచేస్తున్నారు. ఈ సినిమా ఫస్టులుక్ గురువారం సోషల్ మీడియాలో హీరోయిన్ కీర్తి సురేష్ పోస్టు చేసింది. 
 
ఈ ఫస్ట్ లుక్‌లో తిరునెల్వేలి నుంచి ఢిల్లీ కిలోమీటర్లను చూపే రాయిపై విక్రమ్ కూర్చున్నట్లు.. పక్కనే నాలుగు డాగ్స్ వుంటాయి. ఆ రాతి పై నుంచి విక్రమ్ పేల్చే తూటాలు రాకెట్లుగా మారి.. సినిమా పేరును చూపిస్తాయి. ఇంకా విక్రమ్ లుక్ సామి తరహాలోనే సామి-2లో వుంది. ఈ ఫస్ట్ లుక్ ఎలా వుందో మీరూ ఈ వీడియో ద్వారా ఓ లుక్కేయండి.