Widgets Magazine Widgets Magazine
Widgets Magazine

‘సాహోరే బాహుబలి’ పూర్తి వీడియో యూట్యూబ్‌లో విడుదల. మతిపోగొడుతోన్న విజువల్ వండర్

హైదరాబాద్, శుక్రవారం, 19 మే 2017 (06:09 IST)

Widgets Magazine

అద్భుతం, మహాద్భుతం, కమనీయం వంటి భాషలోని పదాలన్నీ వర్ణించినా బాహుబలి2 లోని ఆ భారీతనాన్ని, దృశ అద్భుతాన్ని వర్ణించలేవు. గురువారం బాహుబలి చిత్రబృందం అత్యుత్తమ 4కే క్వాలిటీతో విడుదల చేసిన సాహోరే బాహుబలి పాట యూట్యూబ్‌లో రికార్డును బద్దలు చేసింది. కన్నులవిందు అనే పదానికి అసలైన నిర్వచనంలా రాజమౌళి తెరకెక్కించిన ఈ పాట విడుదలైన కొద్దిసేపటికే భారత్‌లోట్విటర్‌ ట్రెండింగ్‌లో మూడోస్థానం సొంతం చేసుకుంది. 
 
కీరవాణి ఈ పాటకు స్వరాలు సమకూర్చారు. దలేర్‌ మెహెందీ, ఎం.ఎం. కీరవాణి, మౌనిమా ఈ పాటను ఆలపించారు. బాహుబలి2 లోని భారీతనాన్ని మొత్తంగా ఈ పాటలో చూడవచ్చు అన్నంతగా మహాద్భుతంగా మన కళ్లముందు ఒక కొత్త ప్రపంచాన్ని చూపించేసింది. బాహుబలి-2 సినిమాను చూసేందుకు యావత్ ప్రపంచం ఎందుకు వెర్రెత్తి పోతోందో ఈ ఒరిజనల్ పాటను యూట్యూబ్‌లో చూస్తే చాలు అర్థమైపోతుంది. 
 
బాహుబలి2 సినిమాను థియేటర్లోనే చూడండి.. పైరనీ జోలికి వెళ్లవద్దు సినిమా చూసిన సంతృప్తి కలగదు అని ప్రపంచమంతటా సినిమాను చూసిన ప్రేక్షకులు ముక్తకంఠంలో ఎందుకు చాటి చెబుతున్నారో సాహోరె పాట చూసిన తర్వాతే అర్థమవుతోంది. కళ్లముందు ఒక దృశ్య అద్భుతాన్ని సృష్టిస్తున్న పాటను చూస్తుంటే ఇంకా బాహుబలి-2ని చూడని వారికి ఎప్పుడెప్పుడు సినిమా చూసేద్దామా అనేంత ఉత్కంఠ కలుగుతోంది.
 
 
‘బాహుబలి’కి సీక్వెల్‌గా భారీ బడ్జెట్‌తో రూపొందిన ‘బాహుబలి 2’ ప్రపంచ వ్యాప్తంగా చక్కటి విజయం అందుకుంది. ప్రభాస్‌, రానా, అనుష్క, తమన్నా, రమ్యకృష్ణ, సత్యరాజ్‌ ఈ చిత్రంలో కీలక పాత్రలు పోషించారు.
 
ఎవరైనా ఇంకా యూట్యూబ్‌లో సాహోరే బాహుబలి డిజిటల్ పాట చూడనట్లయితే వెంటనే కింది లింకును చూసేయండి.
 
Saahore Baahubali - Baahubali 2 Video Songs | Prabhas, Ramya Krishna
 Widgets Magazine
Widgets Magazine
Widgets Magazine
దీనిపై మరింత చదవండి :  
‘బాహుబలి 2’ చిత్రం ‘భళి భళి రా భళి పాట పూర్తి వీడియో వీడుదల. మహాద్భుతం Song Released Sahore Bahubali Full Video

Loading comments ...

తెలుగు సినిమా

news

జాత్యహంకారమా..? వినోదమా..? ప్రియాంకాచోప్రాకు తప్పని లైంగిక వేధింపులు

హాలీవుడ్‌లో తను నటిస్తున్న చిత్రాల్లో సత్తాచాటుకుంటూ నటనలో కానీ, అందాల ప్రదర్శనలో కానీ ...

news

సమంతకు వడదెబ్బ తగిలిందట.. చెర్రీ యూనిట్‌కు రెస్ట్ ఇచ్చిన సుకుమార్..

సుకుమార్ దర్శకత్వంలో రామ్ చరణ్, సమంత జంటగా నటిస్తున్న సినిమా షూటింగ్ రాజమండ్రి పరిసర ...

news

నాన్నకు అక్కడకు వెళ్లే టైమ్ వచ్చింది.. వెళ్లారు.. పితృవియోగంపై హీరో సుశాంత్

తండ్రిని కోల్పోయి పుట్టెడు దుఃఖంలో ఉన్న హీరో సుశాంత్‌ తన తండ్రి మరణంపై స్పందించారు. ...

news

బాహుబలిని తలపిస్తున్న శ్రుతిహాసన్‌ ‘సంగమిత్ర’ ఫస్ట్‌లుక్‌

ప్రముఖ తమిళ దర్శకుడు సుందర్ సి. రూపొందిస్తున్న సంగమిత్ర సినిమా ఫస్ట్‌లుక్ నిజం చెప్పాలంటే ...

Widgets Magazine