శనివారం, 20 ఏప్రియల్ 2024
  1. వినోదం
  2. తెలుగు సినిమా
  3. కథనాలు
Written By chitra
Last Updated : మంగళవారం, 9 ఫిబ్రవరి 2016 (12:29 IST)

సాయికుమార్‌ డబ్బింగ్‌లో హీరో.. వంద సినిమాలకు డబ్బింగ్ చెప్పి..!

సాయికుమార్ ప్రస్తుతం యాక్టర్‌గా మంచి గుర్తింపు తెచ్చుకున్నాడు. అయితే తనకంటూ గుర్తింపు తెచ్చిపెట్టింది మాత్రం డబ్బింగే. వందల సినిమాలకు డబ్బింగ్ చెప్పి దేశంలోనే ప్రముఖ డబ్బింగ్ ఆర్టిస్టుల్లో ఒకడిగా పేరుసంపాదించుకున్నాడు. వాయిస్‌తోనే అందరిని మంత్ర ముగ్ధుల్నిచేసే ఏకైక స్టార్ సాయికుమార్. ముఖ్యంగా 80లు 90ల్లో రాజశేఖర్, సుమన్‌లిద్దరికీ డబ్బింగ్ చెప్పి చాలా గొప్ప పేరు సంపాదించాడు సాయికుమార్. 
 
అతను లేకుండా సినిమానే చేయలేని పరిస్థితి వచ్చింది. దీనిపై సాయికుమార్ మాట్లాడుతూ... ఒకప్పుడు తానూ ఎక్కువగా డబ్బింగ్ చెప్పిన హీరోలు రాజశేఖర్, సుమన్‌ల మధ్య తానూ ఎలా నలిగిపోయారో వివరించారు. ఈ విషయంలో ఇద్దరికీ ఎలా సమన్వయం కుదిరింది.. సాయికుమార్ వాళ్లిద్దరినీ ఎలా ఒప్పించి డబ్బింగ్ చెప్పాడో వివరిస్తున్నారు.
 
ముందు నేను సుమన్‌కే డబ్బింగ్ చెప్పేవాణ్ని. ఐతే టి.కృష్ణగారి వందేమాతరం సినిమాలో సుమన్, సుహాసిని హీరో హీరోయిన్లని అనుకున్నారు. అయితే ఆ తరువాత హీరో సుమన్ ఒక కేసులో ఇరుక్కుని జైలుకు వెళ్ళడంతో ఆ గ్యాప్‌లో రాజశేఖర్ పాపులర్ కావడంతో తాను కూడ రాజశేఖర్‌‌కు డబ్బింగ్ చెపుతూ పాపులర్ అయ్యానని చెప్పారు. ఆ వాయిస్ బాగా పాపులర్ అవ్వడంతో రాజశేఖర్ తర్వాతి సినిమాలకు కూడా నన్నే కంటిన్యూ అవ్వమన్నారు. 
 
తర్వాత సుమన్ జైలు నుండి రిలీజ్ అయ్యాక సినిమాల్లోకి రీఎంట్రీ ఇచ్చినపుడు తనకు డబ్బింగ్ చెప్పొద్దని గొడవ పెట్టాడు. అదే సమయంలో రాజశేఖర్ కూడా పాపులర్ కావడంతో తనకు మాత్రమే డబ్బింగ్ చెప్పాలని సుమన్‌కు వద్దని ఆదేశించాడు. అయితే  మా అమ్మ ఇద్దరికీ సర్దిచెప్పి.. ఇద్దరికీ కొంచెం వేరియేషన్‌తో నేను డబ్బింగ్ చెప్పేలా ఒప్పించింది అని సాయికుమార్ తన మనసులోని మాటను వెల్లడించాడు.
 
అయితే ఆ తరువాత సుమన్ జైలు నుంచి తిరిగి వచ్చిన తరువాత సుమన్ కూడ పెద్ద హీరోగా మారడంతో అతడికి కూడ డబ్బింగ్ చెప్పే అవకాశాలు వచ్చిన సందర్భాన్ని గుర్తుకు చేసుకుంటూ వారి ఇద్దరి మధ్యా ఏర్పడిన పోటీతో తాను ఎలా నలిగి పోయింది వివరించాడు.
 
సుమన్, రాజశేఖర్ లతో సినిమాలు తీస్తున్న నిర్మాతలు డబ్బింగ్ ఆర్టిస్ట్‌గా తనకు వరుసగా అవకాశాలు ఇస్తుండడంతో సుమన్‌కు డబ్బింగ్ చెప్పిన వ్యక్తి రాజశేఖర్‌కు చెప్పొద్దు, రాజశేఖర్‌కు డబ్బింగ్ చెప్పిన వ్యక్తి సుమన్ కి డబ్బింగ్ చెప్పొద్దూ అని ఆ హీరోలు తమకు తాము నిర్ణయించుకొని తనతో గేమ్ మొదలుపెట్టిన విషయం చెప్పాడు సాయి కుమార్. ఆ సమయంలో తన తల్లి సుమన్ తల్లితో మాట్లాడి తన సమస్య తీరి కెరీర్ ఓ ట్రాక్‌లో పడిందని ఆనాటి ఇగోలను బయటపెట్టాడు సాయి కుమార్.