ఆ హీరోయిన్ అంటే హడలిపోతున్న హీరోలు

గురువారం, 7 డిశెంబరు 2017 (10:28 IST)

sai pallavi

తెలుగు సినీ ప్రేక్షకులను "ఫిదా" చేసిన హీరోయిన్ సాయి పల్లవి. ఈ చిత్రంలో ఆమె నటనకుగాను ప్రతి ఒక్కరూ ఫిదా అయిపోయారు. సినీ ప్రముఖులు ప్రశంసలు వర్షం కురిపించారు. 
 
సాధారణంగా చిత్ర పరిశ్రమలో నిలదొక్కుకోవాలంటే ఎదిగే కొద్దీ ఒదిగి ఉండాలి. ఈ సూత్రాన్ని మాత్రం ఈ అమ్మడు మరిచిపోయినట్టుంది. అందుకే పొగరు తలకెక్కింది. తన తీరుతో చిత్రబృందాన్ని తెగ విసిగించేస్తోందట. ప్రస్తుతం ఆమె రెండు తెలుగు సినిమాల్లో నటిస్తోంది. ఏఎల్ విజయ్ దర్శకత్వంలో నాగశౌర్య హీరోగా వస్తున్న ద్విభాషా చిత్రం ఒకటికాగా, ఎంసీఏ మూవీలో నాని సరసన హీరోయిన్‌గా నటిస్తోంది. ఈ రెండు సినిమాల్లోని టెక్నీషియన్స్, హీరోల ఓపికను పరీక్షిస్తోందట ఈ ముద్దుగుమ్మ.
 
నాగశౌర్య చిత్రం కోసం హీరోతో సహా చిత్ర యూనిట్ అంతా ఉదయం 9:30కి వచ్చి షూటింగ్ స్పాట్‌లో కూర్చుంటే ఈ అమ్మడు మాత్రం తనకు ఇష్టమొచ్చిన 11 లేదా 12 గంటలకో వస్తోందట. సాయి పల్లవి తీరు కారణంగా నాగశౌర్య ఈ ప్రాజెక్ట్‌నే వదులుకునేందుకు సిద్ధమయ్యాడని సమాచారం. దర్శకులు చెప్పినప్పటికీ ఈ అమ్మడు వైఖరిలో మాత్రం మార్పురావడం లేదట. దీంతో దర్శక నిర్మాతల నుంచి హీరోలు సైతం విసిగిపోతున్నారట. దీనిపై మరింత చదవండి :  
Harass Fidaa Heroine Sai Pallavi Hero Naga Shourya

Loading comments ...

తెలుగు సినిమా

news

బాలీవుడ్ హీరోను చితక్కొట్టిన మందుబాబులు

సాధారణంగా వెండితెరపై మందుబాబులను, రౌడీలను హీరోలు చితక్కొడుతుంటారు. కానీ, నిజజీవితంలో ఈ ...

news

కమల్ హాసన్‌తో శ్రుతిహాసన్-మైఖేల్.. పంచెకట్టులో కాబోయే అల్లుడు

సినీ లెజెండ్ కమల్ హాసన్ కుమార్తెలో లండన్‌కి చెందిన మైఖేల్ కోర్సెల్‌తో ప్రేమాయణం ...

news

#Mahanati సర్‌ప్రైజ్‌ అదిరింది... (Video)

అందాల నటి సావిత్ర జయంతి సందర్భంగా "మహానటి" చిత్ర యూనిట్ ఓ సర్‌ప్రైజ్ ఇచ్చింది. టాలీవుడ్ ...

news

'హలో'పై ఏం చెప్పను? మైండ్ బ్లాంక్ అయ్యింది... నాగార్జున ఇంటర్వ్యూ

'మనం' అనేది సెంటిమెంట్‌గా భావించి మనం ఎంటర్‌ప్రైజెస్‌ పెట్టాం. దానిలో నేను, నాగచైతన్య, ...