Widgets Magazine Widgets Magazine
Widgets Magazine

గోపీచంద్ 'ఆక్సిజ‌న్‌'లో సాక్షిచౌద‌రి స్పెష‌ల్ సాంగ్‌....

బుధవారం, 30 నవంబరు 2016 (18:18 IST)

Widgets Magazine
Sakshi Chowdary

ఎగ్రెసివ్‌ హీరో గోపీచంద్‌ కథానాయకుడిగా ఎ.ఎం.జోతికృష్ణ దర్శకత్వంలో శ్రీసాయిరాం క్రియేషన్స్‌ పతాకంపై ఎస్‌.ఐశ్వర్య నిర్మిస్తున్నచిత్రం 'ఆక్సిజన్‌`. ప్ర‌స్తుతం ఈ సినిమా షూటింగ్‌ను శ‌ర‌వేగంగా జ‌రుపుకుంటుంది. ఈ చిత్రంలో హీరోయిన్‌ సాక్షిచౌద‌రి ఓ స్పెష‌ల్ సాంగ్ చేసింది. 
 
ఈ సందర్భంగా నిర్మాత ఎస్‌.ఐశ్వర్య మాట్లాడుతూ 'ఇప్ప‌టివర‌కు ఎవ‌రూ ట‌చ్ చేయ‌ని డిఫ‌రెంట్ పాయింట్‌తో గోపీచంద్ హీరోగా ఆక్సిజ‌న్ సినిమాను రూపొందిస్తున్నాం. సినిమాపై మంచి అంచ‌నాలు నెల‌కొన్నాయి. సినిమా చాలా బాగా వ‌స్తుంది. గోపీచంద్ క్యారెక్ట‌ర్ చాలా కొత్త‌గా, డిఫ‌రెంట్‌గా ఉంటుంది. ప్ర‌స్తుతం ఈ చిత్రం శ‌ర‌వేగంగా షూటింగ్ జ‌రుపుకుంది. చిత్రీక‌ర‌ణ‌లో భాగంగా జేమ్స్‌బాండ్, పోటుగాడు, సెల్ఫీరాజా చిత్రాలతో తెలుగు ప్రేక్ష‌కుల‌కు సుప‌రిచిత‌మైన హీరోయిన్ సాక్షిచౌద‌రి ఓ స్పెష‌ల్ సాంగ్ చేస్తుంది. 
 
ఈ సాంగ్ చిత్రీక‌ర‌ణ ఈ రోజుతో పూర్త‌వుతుంది. ఈ సాంగ్‌ను రామోజీ ఫిలింసిటీలో భారీ దాబా సెట్ వేసి చిత్రీక‌రిస్తున్నాం. 'అరె అదిరిందే నువ్వు కాల‌ర్ గాలిలో ఎగ‌రేసి వ‌స్తుంటే...' అని సాగే పాట‌ను శ్రీమ‌ణి రాయ‌గా బృంద మాస్ట‌ర్ కొరియోగ్ర‌ఫీలో చిత్రీక‌రిస్తున్నాం. ఈ పాట‌లో గోపీచంద్‌, సాక్షిచౌద‌రితో పాటు హీరోయిన్ రాశిఖ‌న్నా, క‌మెడియ‌న్ అలీలు కూడా కాలు క‌దుపుతున్నారు. యాక్షన్ థ్రిల్లర్‌గా రూపొందుతోన్న ఈ చిత్రంలో రాశిఖన్నా, అను ఇమ్మాన్యువల్ హీరోయిన్స్‌గా నటిస్తున్నారు. 
 
ప్రముఖ నటుడు జగపతి బాబు కీలకపాత్రలో నటిస్తున్నారు. ఆయన పాత్ర చాలా హైలైట్‌గా ఉంటుంది. అలాగే ప్రముఖ సంగీత దర్శకుడు యువన్ శంకర్ రాజా సంగీతం సినిమాకు హైలైట్‌గా నిలవనుంది. రామ‌జోగ‌య్య‌ శాస్త్రి, శ్రీమ‌ణి అద్భుత‌మైన సాహిత్యానందించారు. ఈ సినిమాలో మ‌రో సాంగ్‌ను డిసెంబ‌ర్ 2 నుంచి పూణేలో చిత్రీక‌రించ‌నున్నట్టు చెప్పారు. Widgets Magazine
Widgets Magazine
Widgets Magazine
దీనిపై మరింత చదవండి :  

Loading comments ...

తెలుగు సినిమా

news

కరీంనగర్ గీతాభవన్ కాఫీలాంటి.. కాకినాడ సుబ్బయ్య హోటల్ భోజనం లాంటిది..

కాకినాడ అమ్మాయి ప్రేమలో పడిన కరీంనగర్ కుర్రాడి కథగా రూపొందిన "జయమ్ము నిశ్చయమ్ము రా"... ...

news

నాగ చైతన్యకు షాకిచ్చిన జెస్సీ.. ఆ ఒక్కడితో కూడా చేస్తానంటోందట...

ప్రస్తుతం తెలుగు చిత్ర పరిశ్రమలో నాగ చైతన్య - సమంతల ప్రేమాయణం హాట్ టాపిక్‌గా ఉంది. ...

news

షూటింగ్ అపుడే అయిపోయిందా! అని బాధపడ్డా : నాగార్జున

అక్కినేని నాగార్జున నటిస్తున్న 'ఓం నమో వేంకటేశాయ' చిత్రం షూటింగ్‌ కీలక షెడ్యూల్‌ ...

news

అతనికి అభిమానిగా మారిన ఝాన్సీ.. తదుపరి చిత్రానికి కర్చీఫ్ వేసిందట...

యాంకర్‌గా తనకంటూ ప్రత్యేకమైన స్థానాన్ని సంపాదించుకున్న ఝాన్సీ.. నటిగా కూడా కొన్ని ...

Widgets Magazine