గురువారం, 28 మార్చి 2024
  1. వినోదం
  2. తెలుగు సినిమా
  3. కథనాలు
Written By pnr
Last Updated : శుక్రవారం, 30 సెప్టెంబరు 2016 (16:28 IST)

పాక్ నటీనటులు సల్మాన్ ఖాన్ మద్దతు.. వారు టెర్రరిస్టులు కాదు.. భార‌త్‌కు రావాల‌ని పిలుపు

భారత్, పాకిస్థాన్ దేశాల మధ్య తీవ్ర ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్న నేపథ్యంలో బాలీవుడ్ నటుడు సల్మాన్ ఖాన్ సంచలన వ్యాఖ్యలు చేశారు. పాకిస్థాన్ నటీనటులంతా భారత్‌కు రావాలని ఆయన పిలుపునిచ్చారు. ముఖ్యంగా పాక్

భారత్, పాకిస్థాన్ దేశాల మధ్య తీవ్ర ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్న నేపథ్యంలో బాలీవుడ్ నటుడు సల్మాన్ ఖాన్ సంచలన వ్యాఖ్యలు చేశారు. పాకిస్థాన్ నటీనటులంతా భారత్‌కు రావాలని ఆయన పిలుపునిచ్చారు. ముఖ్యంగా పాక్ నటీనటులు తీవ్రవాదులు కాదన్నారు. 
 
యూరీ ఉగ్రదాడి నేపథ్యంలో బాలీవుడ్ లోని పాకిస్థాన్ నటులు 48 గంటల్లోగా దేశం విడిచి వెళ్లిపోవాలంటూ కొన్నిరోజుల క్రితం మహారాష్ట్ర నవనిర్మాణ సేన హెచ్చరించిన సంగతి తెలిసిందే. దీనిపై  స‌ల్మాన్ ఖాన్ సంచ‌ల‌న వ్యాఖ్య‌లు చేశాడు. పాకిస్థాన్ సినీ న‌టులు భార‌త్‌కు రావాల‌ని పిలుపునిచ్చాడు. 
 
యూరీ ఘ‌ట‌న‌కు పాల్ప‌డింది ఉగ్ర‌వాదులే.. కానీ న‌టీన‌టులు కాదన్నారు. పాక్ ఆర్టిస్టులు ఉగ్ర‌వాదులు కాదన్నారు. న‌టీన‌టులు, ఉగ్రవాదులు వేర్వేరు అని ఆయ‌న చెప్పుకొచ్చారు. స‌రైన వీసా వ‌ర్క్ ప‌ర్మిట్‌తో భార‌త్‌కు రావాల‌ని పిలుపునిచ్చాడు. ఎంతో మంది పాక్ క‌ళాకారుల‌కు ఇక్క‌డ నివ‌సించ‌డానికి వాలిడ్ వీసా ఉంద‌ని గుర్తుచేశారు. అదేసమయంలో భారత్, పాకిస్థాన్ దేశాల మధ్య శాంతి వాతావరణం నెలకొనాలన్నారు. 
 
మరోవైపు పాక్ ముష్కరులపై భారత సైన్యం దాడికి ప్రతిగా అక్కడ బాలీవుడ్ సినిమాల ప్రదర్శన నిలిచిపోయింది. లాహోర్‌లో ప్రముఖ సినిమా థియేటర్ సంస్థ 'సూపర్ సినిమా' తన థియేటర్లు వేటిలోనూ భారతీయ సినిమాలను ప్రదర్శించడం లేదంటూ ఫేస్‌బుక్ పేజీలో మెస్సేజ్ పెట్టింది. 
 
పాక్ సైనికులు, కళాకారులకు సంఘీభావంగా ఈ చర్య తీసుకున్నట్టు తెలిపింది. భారతీయ సినిమాల ప్రదర్శనపై నిషేధం నిరవధికంగా కొనసాగుతుందని తెలిపింది. సూపన్ సినిమా అనేది పాకిస్థాన్‌లో పెద్ద సినిమా ఆపరేటర్లలో ఒకటి. ఇక, భారతీయ సినిమాల ప్రదర్శన నిలిపివేస్తున్నట్టు కరాచీలోని నూప్లెక్స్ సినిమా ఆపరేటర్ కూడా ఫేస్‌బుక్‌లో పోస్ట్ చేసింది.