శనివారం, 20 ఏప్రియల్ 2024
  1. వినోదం
  2. తెలుగు సినిమా
  3. కథనాలు
Written By Selvi
Last Updated : మంగళవారం, 26 జులై 2016 (16:26 IST)

కృష్ణజింకల కేసు- సల్మాన్ నిర్దోషి.. రామ్ గోపాల్ వర్మ ఏమన్నారో తెలుసా?

బాలీవుడ్ కండల వీరుడు సల్మాన్ ఖాన్‌కు కృష్ణజింకలను వేటాడిన కేసుల్లో ఊరట లభించడంపై సోషల్ మీడియాలో ఇప్పటికే పలు విమర్శలు వెల్లువెత్తుతున్న నేపథ్యంలో.. సల్మాన్ ఖాన్‌కు కృష్ణ జింకల కేసులో నిర్దోషిత్వం ఇవ్వ

బాలీవుడ్ కండల వీరుడు సల్మాన్ ఖాన్‌కు కృష్ణజింకలను వేటాడిన కేసుల్లో ఊరట లభించడంపై సోషల్ మీడియాలో ఇప్పటికే పలు విమర్శలు వెల్లువెత్తుతున్న నేపథ్యంలో.. సల్మాన్ ఖాన్‌కు కృష్ణ జింకల కేసులో నిర్దోషిత్వం ఇవ్వడంపై వివాదాస్పద దర్శకుడు రామ్ గోపాల్ వర్మ స్పందించాడు.

ఈ వ్యవహారంపై రామ్ గోపాల్ వర్మ మరోసారి తనదైన శైలిలో కామెంట్స్ చేశారు. ''కేవలం సెలబ్రిటీ కేసుల్లోనే మన న్యాయవ్యవస్థ ఎంత నెమ్మదిగా పనిచేస్తుందో తెలుస్తోంది. సల్మాన్ నిర్దోషి అని చెప్పడానికి న్యాయవ్యవస్థకు ఇరవై సంవత్సరాలు పట్టిందంటూ" వర్మ ట్వీట్ చేశారు.
 
కాగా, 1998లో జోథ్ పూర్‌లో రెండు వేర్వేరు ఘటనల్లో రక్షిత వన్యప్రాణులైన ఓ కృష్ణజింకను, ఓ మామూలు జింకను వేటాడి చంపినట్టు సల్మాన్‌తో పాటు మరో ఏడుగురిపై కేసులు నమోదయ్యాయి. ఈ కేసులలో జోథ్ పూర్ కోర్టు సల్మాన్‌కు ఐదేళ్ల జైలుశిక్ష విధించగా.. ఈ ఉత్తర్వులను హైకోర్టు కొట్టివేసింది.

ఈ కేసులో వాదనలు గత మే నెలలో ముగిశాయి. దీంతో తీర్పును రిజర్వ్ చేసిన హైకోర్టు సోమవారం తుది ఉత్తర్వులను జారీ చేస్తూ సల్మాన్ నిర్దోషిగా ప్రకటించింది.