శనివారం, 20 ఏప్రియల్ 2024
  1. వినోదం
  2. తెలుగు సినిమా
  3. కథనాలు
Written By CVR
Last Updated : మంగళవారం, 30 జూన్ 2015 (11:41 IST)

జోరుగా 'బాహుబలి' ప్రమోషన్ వర్క్.. బాలీవుడ్‌లో సల్మాన్ క్రేజ్..

రాజమౌళి ప్రతిష్టాత్మకంగా తెరకెక్కించిన చిత్రం ''బాహుబలి''. దేశ వ్యాప్తంగా సినీ అభిమానులు ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్న ఈ చిత్రం సెన్సార్ పూర్తి చేసుకుని  విడుదలకు సిద్ధమైంది. రెండు భాగాలుగా తెరకెక్కుతున్న ఈ చిత్రంలో తొలి భాగం ''బాహుబలి - ది బిగినింగ్''గా జూలై 10న విడుదల అవుతుంది. ప్రస్తుతం ఈ చిత్ర ప్రమోషన్ వర్క్ జోరుగా జరుగుతోంది. 
 
తెలుగు, తమిళం, హిందీ భాషల్లో విడుదలవుతున్న ''బాహుబలి'' ప్రపంచవ్యాప్తంగా భారీ అంచనాలను నెలకొంది. గతంలో ఎన్నడూ లేనివిధంగా సౌత్ సినిమా అయిన బాహుబలికి బాలీవుడ్‌లో కూడా భారీ ప్రచారం జరుగుతుంది. ఇక ''బాహుబలి-2'' వచ్చే ఏడాది విడుదల కానున్నది. ఈ సినిమాలో ఇప్పుడున్న పాత్రలతో పాటు కొత్త పాత్రలు రాబోతున్నాయని సమాచారం వెల్లడైంది. 
 
ఆ కొత్త పాత్రల్లో తమిళ స్టార్ హీరో సూర్య నటించబోతున్నట్లు ఇప్పటికే వార్తలు వచ్చాయి. తాజాగా ''బాహుబలి - 2'' హిందీ వెర్షన్‌లో బాలీవుడ్ స్టార్ సల్మాన్ ఖాన్‌ నటించనున్నట్లు వార్తలు వెల్లడవుతున్నాయి. ఈ విషయంపై ఇప్పటికే ఆయనతో సంప్రదింపులు కూడా జరిపినట్లు తెలుస్తుంది. అయితే సల్మాన్ ఖాన్ ఈ సినిమాలో కనుక నటిస్తే ఈ సినిమాకి మరింత క్రేజ్ పెరుగుతుందని చిత్ర దర్శక నిర్మాతలు అభిప్రాయపడుతున్నారట. మరి ఈ సినిమాలో నటించడానికి సల్మాన్ సమాధానం రావాల్సి ఉంది.