శుక్రవారం, 19 ఏప్రియల్ 2024
  1. వినోదం
  2. తెలుగు సినిమా
  3. కథనాలు
Written By Raju
Last Modified: హైదరాబాద్ , బుధవారం, 15 మార్చి 2017 (07:25 IST)

శ్రీదేవి మా అందరికంటే పెద్ద స్టార్.. సలామ్ అంటున్న సల్మాన్

ప్రస్తుతం బాలీవుడ్‌లో ఉన్న అందరు హీరోల కంటే పెద్ద స్టార్ నా దృష్టిలో శ్రీదేవే అంటూ బాలీవుడ్ కండలవీరుడు సల్మాన్‌ఖాన్ ఒకనాటి స్వప్న సుందరి శ్రీదేవిని ఆకాశానికెత్తేశాడు. తాను, షారుఖ్ ఖాన్, అమీర్ ఖాన్, అక్షయ్ కుమార్ కంటే అతి పెద్ద స్టార్ ఆమేనన సల్మాన్ ప్

ప్రస్తుతం బాలీవుడ్‌లో ఉన్న అందరు హీరోల కంటే పెద్ద స్టార్ నా దృష్టిలో శ్రీదేవే అంటూ బాలీవుడ్ కండలవీరుడు సల్మాన్‌ఖాన్ ఒకనాటి స్వప్న సుందరి శ్రీదేవిని ఆకాశానికెత్తేశాడు. తాను, షారుఖ్ ఖాన్, అమీర్ ఖాన్, అక్షయ్ కుమార్ కంటే అతి పెద్ద స్టార్ ఆమేనన సల్మాన్ ప్రశంసించాడు. శ్రీదేవి తాజాగా నటిస్తున్న మామ్ సినిమా తొలి పోస్టర్ ముంబైలో మంగళవారం ఆవిష్కరించిన సందర్భంగా సల్మాన్ నిజమైన స్టార్ అంటే ఆమే అంటూ పొగిడాడు.
 
బాలీవుడ్ చరిత్రలో ఈ మధ్యకాలంలో ఒక నటిని తమకంటే పెద్ద స్టార్ అంటూ స్టార్ హీరో ప్రశంసించడం ఇదే మొదటిసారి. మామ్ చిత్రం తొలి పోస్టర్ ఆవిష్కరణ సందర్భంగా వేదికపై శ్రీదేవిని పరిచయం చేస్తూ హోస్ట్ మనీష్ పాల్ ఆమెను స్టార్ ఆఫ్ ది మిలీనియం అని చెప్పినతర్వాత దబాంగ్ హీరో సల్మాన్ అతడిని ఆగమని అడ్డుకుని శ్రీదేవి నటనా వైదుష్యం గురించి మాట్లాడడం ప్రారంభించాడుట
 
అమీర్ ఖాన్, షారుఖ్ ఖాన్, అక్షయ్ కుమార్.. మేమంతా అనేక సినిమాలు తీశాం. అమీర్ 50 సినిమాలు తీసి ఉంటాడు. సంవత్సరానికి ఒక సినిమా మాత్రమే తీస్తున్నాడు. షారుఖ్ వందకు పైగా సినిమాలు తీసి ఉంటాడు. మేమంతా కలిసి ఇప్పటికి 250 నుంచి 275 సినిమాలు తీసి ఉంటాం. కాని ఇక్కడ ఒక దిగ్గజ నటి అత్యంత ప్రతిభావంతురాలు, అంకిత భావం, తీవ్ర కృషి, పక్కా ప్రొఫెషనల్ అయిన ఆమె 300 పైగా సినిమాలు తీశారు. బాలనటిగా జీవితం ప్రారంభించారు. మా కృషి ఆ దిగ్గజం సాధించిందాంతో ఏమాత్రం పోల్చుకోలేనిది. ఆమె ఎవరో కాదు శ్రీదేవి.. అంటూ సల్మాన్ ప్రశంసల వర్షం కురిపించాడు.
 
భారతీయ సినిమా చిరిత్రలో అతి గొప్ప స్టార్‌లలో ఒకరుగా గుర్తించబడుతున్న శ్రీదేవి హిందీ సినిమాల్లోనే కాదు.. తమిళం, మలయాళం, తెలుగు, కన్నడ సినిమాల్లోనూ నటించారని సల్మాన్ వివరించారు. 
 
శ్రీదేవి భర్త బోనీ కపూర్ తీస్తున్న మామ్ సినిమా 2012లో ఇంగ్లీష్ వింగ్లిష్ సినిమాలో నటించిన అయిదేళ్ల తర్వాత శ్రీదేవి పూర్తి స్థాయి పాత్రలో నటిస్తున్న సినిమా కావడం విశేషం. తన సవితిపుత్రికతో సంబంధాలు దెబ్బతిన్న భావోద్వేగ పాత్రలో ఆమె నటిస్తోంది. తనకు జరిగిన అన్యాయంపై పోరాడే పాత్రలో ఆమె నటిస్తోంది. మంగళవారం విడుదల చేసిన మామ్ తొలి పోస్టర్లో మదర్ పేరును అన్ని భాషల్లో ప్రింట్ చేయడం విశేషం. కానీ ఆ పోస్టర్‌లో వాడిన రంగు మాత్రం థ్రిల్లర్ ఫీలింగ్‌ను కలిగిస్తోంది.
 
ఈ సినిమాలో పాకిస్తాన్ నటులు సాజల్ ఆలీ, అదాన్ సిద్దీకి ముఖ్య పాత్రలను పోషిస్తున్నారు. బాలివుడ్ సహజ నటుడు నవాజుద్దన్ సిద్దిఖి కూడా మామ్ చిత్రంలో ఒక పాత్రలో కనిపించనున్నాడు.