శుక్రవారం, 29 మార్చి 2024
  1. వినోదం
  2. తెలుగు సినిమా
  3. కథనాలు
Written By Selvi
Last Updated : ఆదివారం, 29 నవంబరు 2015 (17:18 IST)

సమంతని ఆంటీ చేసేశారా.. చీరకట్టులోనే సమంత.. పాపకు తల్లిగా కూడా?

తెలుగులో ఫస్ట్ నుంచే సమంతని ట్రెండీగానే చూపిస్తున్నారు. సమంత చీరకట్టుతోనే తెలుగు తెరకు పరిచయమైనా ఆ లుక్కుతోనే ఆకట్టుకుంది. అయినా ఆమెను మోడన్ డ్రస్సుల్లోనూ మన దర్శకులు చూపెట్టారు. కానీ తమిళ దర్శకులు మాత్రం ఇటీవల సమంతని చీరకట్టుకే పరిమితం చేస్తున్నట్టు కనిపిస్తోంది. రాబోయే సినిమాల్లో ఆమె అన్నీ మెచ్చూర్డ్ క్యారెక్టర్‌లే పోషిస్తున్నట్టు సమాచారం. 
 
ధనుష్‌తో కలిసి నటిస్తున్న తంగమగన్‌లో సమంత చీరలోనే దర్శనమిస్తుంది. అలాగే సూర్యతో కలిసి నటిస్తున్న 24లోనూ చీరే కట్టింది. అందుకు సంబంధించిన స్టిల్స్ కూడా ఇటీవల బయటికొచ్చాయి. ఇక విజయ్‌తో కలిసి నటించనున్న కొత్త సినిమాలోనూ ఆమె ఇల్లాలిగా కనిపించబోతోందట.

ఇల్లాలి పాత్ర అంటే చీరలోనే కదా కనిపించేది. అంతే కాదు.. ఆమె ఓ పాపకి తల్లిగా కూడా దర్శనమివ్వబోతోందని సమాచారం. పాప పాత్రని మీనా కూతురు పోషిస్తోంది. చూస్తుంటే తమిళంలో సమంతని అప్పుడే ఆంటీగా మార్చేశారనిపిస్తోంది.