మంగళవారం, 16 ఏప్రియల్ 2024
  1. వినోదం
  2. తెలుగు సినిమా
  3. కథనాలు
Written By CVR
Last Updated : సోమవారం, 31 ఆగస్టు 2015 (10:11 IST)

బ్రహ్మోత్సవంలో సమంత ఉంది... మేనేజర్ క్లారిటీ..

శ్రీకాంత్ అడ్డాల దర్శకత్వంలో మహేష్ బాబు నటిస్తున్న తాజాగా చిత్రం 'బ్రహ్మోత్సవం'. ఈ చిత్రంలో మహేష్ సరసన సమంతా నటించడం లేదంటూ ఇటీవల మీడియాలో వార్తలొచ్చిన సంగతి విదితమే. అయితే, ఈ విషయాన్ని సమంతా మేనేజర్ ఖండించాడు. 'బ్రహ్మోత్సవం'లో సమంతా నటిస్తోందని స్పష్టం చేశాడు. అంతేకాదు, ఆ సినిమా షూటింగులో ఆమె సెప్టెంబర్ 20న జాయిన్ అవుతుందని కూడా వివరించాడు. 
 
కాగా, ఈ సినిమాలో ముగ్గురు హీరోయిన్లు వుంటారు. ఆ పాత్రల కోసం సమంతా, కాజల్, ప్రణీతలను ఎంచుకున్నారు. అయితే, ఇందులో నటించడానికి మొదట్లో డేట్స్ సమస్యతో తప్పుకున్న రకుల్ ప్రీత్ సింగ్ ఇటీవల మళ్లీ డేట్స్ అడ్జస్ట్ చేసిందని, దాంతో సమంతాను తప్పిస్తారని మీడియాలో వార్తలొచ్చాయి. ఈ నేపథ్యంలోనే సమంతా మేనేజర్ క్లారిటీ ఇచ్చాడు.