గురువారం, 25 ఏప్రియల్ 2024
  1. వినోదం
  2. తెలుగు సినిమా
  3. కథనాలు
Written By Selvi
Last Updated : శుక్రవారం, 27 జనవరి 2017 (13:39 IST)

నాగచైతన్యతో 29న నిశ్చితార్థం.. ఫ్యాన్స్‌కు ప్రేమతో సమంత లవ్ స్టోరీ పేజీ

అక్కినేని నాగ చైతన్యతో త్వరలో నిశ్చితార్థం కుదుర్చుకోనున్న సమంత.. ఖుషీ ఖుషీగా కనిపిస్తోంది. టాలీవుడ్ అగ్రనాయిక అయిన సమంత ఓ ప్రత్యేక వీడియోను సోషల్ మీడియాలో పోస్ట్ చేసింది. అక్కినేని నాగచైతన్య, సమంతల న

అక్కినేని నాగ చైతన్యతో త్వరలో నిశ్చితార్థం కుదుర్చుకోనున్న సమంత.. ఖుషీ ఖుషీగా కనిపిస్తోంది. టాలీవుడ్ అగ్రనాయిక అయిన సమంత ఓ ప్రత్యేక వీడియోను సోషల్ మీడియాలో పోస్ట్ చేసింది. అక్కినేని నాగచైతన్య, సమంతల నిశ్చితార్థం ఈ నెల 29న జరగనుంది. వివాహాన్ని కూడా ఈ ఏడాదిలోనే నిర్వహించనున్నారు. చైతూ, సమంత కలిసి 'ఏమాయ చేసావె' చిత్రంలో నటించిన నేపథ్యంలో ఈ సినిమా నుంచి వీరిద్దరి మధ్య ప్రేమ చిగురించిందని సినీ పండితులు అంటున్నారు. 
 
ఈ నేపథ్యంలో 'ఏమాయ చేసావె'లో చిత్రంలోని ఓ స్టిల్‌ను చెక్కుతూ ఉన్న వీడియోను సమంత ట్విట్టర్‌ ద్వారా షేర్‌ చేశారు. 'నా లవ్‌స్టోరీ పేజీ నుంచీ.. మీకు ప్రేమతో' అని ట్వీట్‌ చేశారు. ఈ వీడియోను చూసిన సమంత స్నేహితులు, అభిమానులు ఆమెను శుభాకాంక్షలతో ముంచెత్తారు. ఈ వీడియోకు సోషల్ మీడియాలో లైక్స్, షేర్లు వెల్లువెత్తుతున్నాయి.