సమంతకు అది చాలా ఇష్టం... నాగచైతన్య (video)

''ఏ మాయ చేసావె'' సినిమాతో తెరంగేట్రం చేసి టాలీవుడ్ టాప్ హీరోయిన్‌గా ఎదిగిన సమంత ప్రస్తుతం.. అక్కినేని నాగార్జునకు కోడలైన సంగతి తెలిసిందే. తన ప్రియుడు చైతూను పెళ్లాడిన సమంత ప్రస్తుతం వివాహానికి తర్వాత

Selvi| Last Updated: గురువారం, 12 జులై 2018 (14:31 IST)
''ఏ మాయ చేసావె'' సినిమాతో తెరంగేట్రం చేసి టాలీవుడ్ టాప్ హీరోయిన్‌గా ఎదిగిన ప్రస్తుతం.. అక్కినేని నాగార్జునకు కోడలైన సంగతి తెలిసిందే. తన ప్రియుడు చైతూను పెళ్లాడిన సమంత ప్రస్తుతం వివాహానికి తర్వాత కూడా సినిమాలతో బిజీ బిజీగా వుంది. వెండితెరపై విభిన్నపాత్రలను ఎంచుకుంటూ సమంత ముందుకు దూసుకెళ్తుంది. 
 
అయితే ఇటీవల సమంత సినిమాలకు దూరం అవుతుందని, ఆమె చేతిలో వున్న సినిమాలను పూర్తి చేసుకుని.. సినిమాలకు గుడ్ బై చెప్పేస్తుందని వార్తలొచ్చాయి. సమంత గర్భం దాల్చిందని.. ఆ కారణంగా సినిమాలను పక్కనబెట్టేయాలనుకుంటున్నట్లు ఫిలిమ్ నగర్ వర్గాల్లో జోరుగా ప్రచారం సాగుతోంది. ఈ వార్తలపై చైతూ సోషల్ మీడియా ద్వారా స్పందించాడు. 
 
సినిమాలకి సమంత పూర్తిగా దూరం కానుందంటూ జరుగుతున్న ప్రచారంలో ఎంతమాత్రం నిజం లేదని చైతూ క్లారిటీ ఇచ్చాడు. సమంతకి సినిమాలంటే చాలా ఇష్టమని.. అందుచేత సమ్మూ ఈ రంగానికి దూరం కాదని.. అవసరాన్ని బట్టి అప్పుడప్పుడు చిన్నపాటి బ్రేక్ తీసుకుంటే తీసుకోవచ్చు కానీ సినిమాలకు దూరం కాదని చైతూ తెలిపాడు. 
 
కాగా.. పెళ్లికి ముందు తర్వాత తెలుగు, తమిళ తెరలపై విభిన్నమైన పాత్రల్లో కనిపిస్తూ సమంత విజయాలను అందుకుంటూ సమంత ముందుకు సాగుతోంది. పెళ్లికి తర్వాత రంగస్థలం, అభిమన్యుడు వంటి సినిమాలతో హిట్ కొట్టిన సమంత చేతిలో నాలుగు సినిమాలున్నాయని టాక్.దీనిపై మరింత చదవండి :