Widgets Magazine Widgets Magazine
Widgets Magazine

"రంగస్థలం 1985": సమంత లుక్ ఇదే.. విలేజ్ అమ్మాయిగా.. మేకప్ లేకుండా?

శుక్రవారం, 30 జూన్ 2017 (11:12 IST)

Widgets Magazine

రంగస్థలం షూటింగ్ శరవేగంగా జరుపుకుంటోంది. రామ్‌చరణ్‌, సుకుమార్‌ కాంబోలో తెరకెక్కనున్న ఈ సినిమాలో సమంత నటిస్తోంది. ఇందులో సమంత లుక్ సంబంధించిన పిక్ ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. ‘రంగస్థలం 1985’ పేరిట రూపుదిద్దుకుంటున్న ఈ చిత్రంలో సమంత విలేజ్ అమ్మాయిగా ఆకట్టుకోనుంది. గ్లామర్ హీరోయిన్‌గా ఓ వెలుగు వెలిగిన సమంత ఈ చిత్రంలో మేకప్ లేకుండా సాధారణ గ్రామీణ మహిళగా కనిపిస్తోంది. 
 
మరోవైపు చరణ్‌ క్యారెక్టర్‌ లుక్స్‌ కూడా ఆకట్టుకుంటున్నాయి. సహజత్వానికి దగ్గరగా ఈ పాత్రలు వుంటాయి. గోదావరి తీర ప్రాంతాల్లో ఈ సినిమా షూటింగ్ జరిపారు. చరణ్‌ కెరీర్‌లో ఈ చిత్రం ప్రతిష్టాత్మకంగా మారనుందని సినీ పండితులు ఇప్పుడే జోస్యం చెప్పేశారు. 
 
దర్శకుడిగా సుకుమార్‌పై ఉన్న నమ్మకం వల్ల ప్రీ బిజినెస్‌ క్రేజీగా జరుగుతోంది. కేవలం డిజిటల్‌, శాటిలైట్‌ హక్కుల ద్వారా 25 కోట్లు వచ్చాయని ట్రేడ్‌ వర్గాల సమాచారం. ఇకపోతే.. ఈ సినిమాలో చెర్రీ ఓ థియేటర్ ఆర్టిస్ట్ పాత్ర పోషిస్తున్నాడని తెలుస్తోంది. స్వతహాగా థియేటర్ ఆర్ట్స్‌పై ఆసక్తిగల ఆర్టిస్ట్ అయిన ఓ యువకుడు తాను సొంతంగా స్థాపించిన కంపెనీకి పెట్టుకున్న పేరే ఈ రంగస్థలం 1985 అని సమాచారం.Widgets Magazine
Widgets Magazine
Widgets Magazine
దీనిపై మరింత చదవండి :  

Loading comments ...

తెలుగు సినిమా

news

బాహుబలి-2 ట్రైలర్ కొత్త రికార్డు.. 150 మిలియన్ వ్యూస్ దాటేసింది.. చైనాలో రిలీజ్

ప్రభాస్, రానా ప్రధాన పాత్రధారులుగా దర్శకధీరుడు రాజమౌళి తెరకెక్కించిన బాహుబలి-2 సినిమా ...

news

నటుడు అజయ్ భార్య 2017 మిసెస్‌‌ ఇండియా వరల్డ్‌ ఫైనల్ రౌండ్‌కి... కిరీటం వచ్చేస్తుందిలే...

మిస్ ఇండియా పోటీల్లో నెగ్గడం చాలా సుళువే అంటారు చాలామంది. కానీ మిసెస్ ఇండియా వరల్డ్ వైడ్ ...

news

రవితేజ నవ్వుతూ సెల్ఫీ... యాధృచ్చికం, అటు దిల్ రాజు భార్య, ఇటు రవితేజ బ్రదర్

విధి రాతను ఎవ్వరూ తప్పించలేరు. అయినవాళ్లు దూరమైనప్పుడు కలిగే బాధ వర్ణనాతీతం. హీరో రవితేజ ...

news

హెల్త్ చెకప్‌ కోసం యుఎస్ వెళ్లనున్న 'తలైవా'.. రజనీకాంత్ పొలిటికల్ ఎంట్రీ అంతేనా?

కోట్లాది మంది అభిమానులు ముద్దుగా పిలుచుకునే తలైవా (రజనీకాంత్) మరోమారు అమెరికా ...

Widgets Magazine