శుక్రవారం, 29 మార్చి 2024
  1. వినోదం
  2. తెలుగు సినిమా
  3. కథనాలు
Written By శ్రీ
Last Modified: బుధవారం, 22 మే 2019 (21:15 IST)

ఓ.. బేబీ ఫ‌స్ట్ లుక్ బాగానే ఉంది. ఇంత‌కీ సినిమా ప‌రిస్థితి ఏంటి.?

తెలుగు సినిమా ఇండ‌స్ట్రీలో ఎన్నో అద్భుత‌మైన చిత్రాల‌ను నిర్మించ‌డ‌మే కాదు.. శ‌తాధిక చిత్రాలను నిర్మించిన ఏకైక సంస్థ సురేష్ ప్రొడ‌క్ష‌న్స్‌. భార‌తీయ అధికారిక భాష‌ల‌న్నింటిలోనూ సినిమాలు నిర్మించిన వ‌న్ అండ్ ఓన్లీ ప్రొడ‌క్ష‌న్ హౌస్ కూడా సురేష్ ప్రొడ‌క్ష‌న్స్. ఎన్టీఆర్‌, ఎ.ఎన్‌.ఆర్ వంటి నాటి అగ్ర క‌థానాయ‌కుల నుండి నేటి కుర్ర స్టార్స్ వ‌ర‌కు సినిమాల‌ను నిర్మించిన ఈ నిర్మాణ సంస్థ ఈ ఏడాదితో 55 వ‌సంతాల‌ను పూర్తి చేసుకుంటుంది. 
 
ఈ సంద‌ర్భంగా సురేష్ ప్రొడ‌క్ష‌న్స్‌లో నిర్మిస్తున్న `ఓ బేబి` సినిమా ఫ‌స్ట్ లుక్‌ను విడుద‌ల చేశారు. ఎలాంటి పాత్ర‌కు అయినా.. త‌న న‌ట‌న‌తో ప్రాణం పోస్తూ సినిమా స‌క్సెస్‌లో కీల‌క భూమిక పోషిస్తున్న అగ్ర క‌థానాయిక స‌మంత అక్కినేని. ఓ బేబి చిత్రంలో స‌మంత ప్ర‌ధాన పాత్ర‌ధారిగా న‌టించారు. ఈమెతో పాటు సీనియ‌ర్ న‌టి ల‌క్ష్మి కూడా కీల‌క పాత్ర‌లో న‌టించారు. `ఓబేబి` ఫ‌స్ట్ లుక్‌లో స‌మంతతో పాటు సీనియ‌ర్ న‌టి ల‌క్ష్మి కూడా ఉన్నారు. ఈ చిత్రాని బి.వి.నందినీ రెడ్డి ద‌ర్శ‌క‌త్వం వ‌హించారు. చిత్రీక‌ర‌ణంతా పూర్త‌య్యింది. పోస్ట్ ప్రొడ‌క్ష‌న్ కార్య‌క్ర‌మాలు జ‌రుగుతున్నాయి. 
 
అన్నీ కార్య‌క్ర‌మాల‌ను పూర్తి చేసి ఈ చిత్రాన్ని జూలైలో విడుద‌ల చేయాల‌నుకుంటున్నారు. రావు ర‌మేష్‌, రాజేంద్ర ప్ర‌సాద్‌, ప్ర‌గ‌తి కీల‌క పాత్ర‌ల్లో న‌టించారు. మిక్కి జె.మేయ‌ర్ సంగీతం అందించిన ఈ చిత్రానికి రిచ‌ర్డ్ ప్ర‌సాద్ సినిమాటోగ్ర‌ఫీ అందించారు. 
 
సురేష్ ప్రొడ‌క్ష‌న్స్‌, పీపుల్ మీడియా ఫ్యాక్ట‌రీ, గురు ఫిలింస్‌, క్సాస్ పిక్చ‌ర్స్ సంయుక్తంగా ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. అయితే... మ‌జిలీతో బ్లాక్ బ‌ష్ట‌ర్ సొంతం చేసుకున్న స‌మంత ఈ సినిమాతో కూడా స‌క్స‌స్ సాధించాల‌ని ప‌ట్టుద‌ల‌తో ఉంద‌ట‌. అందుక‌ని రిలీజ్ డేట్ విష‌యంలో మంచి డేట్ చూడ‌మ‌ని సురేష్ ప్రొడ‌క్ష‌న్స్‌కి చెప్పింద‌ట‌. అందుక‌నే ముందుగా మే నెలాఖ‌రున రిలీజ్ చేయాలి అనుకున్నా... ఆఖ‌రికి జులైకి పోస్ట్‌పోన్ చేసార‌ట‌.