సమంత మూడు సినిమాలు.. వేసవిలో వరుసగా వచ్చేస్తున్నాయ్..

Last Updated: శనివారం, 16 మార్చి 2019 (17:44 IST)
పెళ్లి చేసుకున్నా.. జోరు తగ్గలేదు. పెళ్లికి తర్వాత సమంత వరుస సినిమాలు చేస్తూ వస్తోంది. తాజాగా సమంత హీరోయిన్‌గా నటించిన తమిళ సినిమా సూపర్ డీలక్స్ ఈ నెల 29వ తేదీన విడుదల కానుంది. అదే రోజున తెలుగులోనూ ఆ సినిమా విడుదల చేయాలని దర్శక నిర్మాతలు భావిస్తున్నారు. అలాగే చైతూ-సమంత జంటగా నటించిన 'మజిలీ' సినిమా కూడా విడుదలకు సిద్ధమైంది. 
 
ఈ చిత్రం ఏప్రిల్ ఐదో తేదీన విడుదల కానుంది. ఈ రెండు సినిమాలే కాకుండా సమంత నటించిన ''బేబీ'' కూడా వేసవిలో ప్రేక్షకుల ముందుకు రానుంది. ఈ సినిమాను తెలుగులోనే కాకుండా తమిళంలోనూ ఈ చిత్రం విడుదల కానుంది. దీంతో ఈ వేసవిలో సమంత నటించిన 3 సినిమాలు ప్రేక్షకుల ముందుకు రానున్నాయని ఫ్యాన్స్ పండగ చేసుకుంటున్నారు. 
 
ఇక 2018లో సమంత హ్యాట్రిక్ సినిమాలను తన ఖాతాలో వేసుకుంది. గత ఏడాది వేసవిలో రంగస్థలం, మహానటి, అభిమన్యుడు సినిమాలు విడుదలై కలెక్షన్ల వర్షం కురిపించిన సంగతి తెలిసిందే. ఇదే తరహాలో 2019 వేసవిలోనూ విడుదలయ్యే మజిలీ, సూపర్ డీలక్స్, ఓ బేబీ సినిమాలు కూడా బంపర్ హిట్ అవుతాయని సినీ పండితులు జోస్యం చెప్తున్నారు.



దీనిపై మరింత చదవండి :