గురువారం, 25 ఏప్రియల్ 2024
  1. వినోదం
  2. తెలుగు సినిమా
  3. కథనాలు
Written By Selvi
Last Updated : శనివారం, 23 జులై 2016 (12:45 IST)

చిరంజీవి 150వ సినిమాలో హీరోయిన్‌గా జాక్వెలిన్.. కమేడియన్‌గా సంపూర్నేష్ కన్ఫామా?!

మెగాస్టార్ చిరంజీవి 150వ సినిమాపై రోజుకో వార్త పుట్టుకొస్తుంది. ఇప్పటికే తొలి షెడ్యూల్ పూర్తి చేసుకున్న ఈ సినిమాలో జాక్వెలిన్ ఫెర్నాండెజ్ హీరోయిన్‌గా కన్ఫామ్ అయినట్లు టాలీవుడ్‌లో జోరుగా ప్రచారం సాగుతో

మెగాస్టార్ చిరంజీవి 150వ సినిమాపై రోజుకో వార్త పుట్టుకొస్తుంది. ఇప్పటికే తొలి షెడ్యూల్ పూర్తి చేసుకున్న ఈ సినిమాలో జాక్వెలిన్ ఫెర్నాండెజ్ హీరోయిన్‌గా కన్ఫామ్ అయినట్లు టాలీవుడ్‌లో జోరుగా ప్రచారం సాగుతోంది. రెండో షెడ్యూల్ చేవెళ్ల ప్రాంతాల్లో జరుగనుంది. ప్రస్తుతానికి సినిమా షూటింగ్ ఆపేసి.. ఏపీ ప్రత్యేక హోదా కోసం కేవీపీ బిల్లుకు ఓటేసేందుకు చిరంజీవి ఢిల్లీ వెళ్ళారు. 
 
ఈ నేపథ్యంలో రెండో షెడ్యూల్ నుంచి హీరోయిన్ ఈ సినిమా షూటింగ్‌లో జాయిన్ అవుతుందని టాక్ వస్తోంది. కామెడీ ఎంటర్‌టైనర్‌గా, గుడ్ స్క్రిప్టుతో రూపుదిద్దుకునే ఈ చిత్రంలో కామెడీకి ప్రియారిటీ ఇవ్వాలని చిత్ర యూనిట్ భావిస్తోంది. ఇందులో భాగంగా పలువురు కమెడీయన్స్‌ని పరిశీలిస్తున్నారు. మొదట సునీల్‌ని అనుకున్నా ఆ తరువాత వెన్నెల కిషోర్‌కి ఆ గోల్డెన్ ఛాన్స్ ఇచ్చినట్లు వార్తలొచ్చాయి. 
 
ఇక అలీ కూడా సెట్లో కనిపించడం ఆయన కూడా మెగాస్టార్ 150వ సినిమాలో ఉన్నట్లు అనుమానాలు మొదలయ్యాయి. అయితే బర్నింగ్ స్టార్ సంపూర్ణేష్‌కి యూనిట్ నుండి కాల్ వచ్చిందనే టాక్ నడుస్తోంది. త్వరలో సినిమా షూటింగ్‌లో పాల్గొనాల్సిందిగా పిలుపొచ్చింది. అంతే సంపూర్నేష్ ఆనందానికి అవధుల్లేవ్.