శనివారం, 20 ఏప్రియల్ 2024
  1. వినోదం
  2. తెలుగు సినిమా
  3. కథనాలు
Written By DV
Last Modified: మంగళవారం, 24 మే 2016 (19:11 IST)

సంపూ 'కొబ్బరిమట్ట' భారీ డైలాగ్‌... ఆడదంటే ఎవరనుకున్నావురా...(Video)

'హృదయకాలేయం' వచ్చి రెండేళ్లయింది. ఆ సినిమా తర్వాత సంపూర్ణేష్‌ బాబుకు మళ్ళీ అంత హిట్‌ రాలేదు. అందుకే అదే దర్శకనిర్మాతతో 'కొబ్బరిమట్ట'లో నటించాడు. ఇందులో సంపూ చెప్పిన భారీ డైలాగ్‌ను టీజర్‌లో రిలీజ్‌ చేశారు. ఆడదంటే ఎవరనుకున్నావ్‌... అంటూ... మూడు నిమిషా

'హృదయకాలేయం' వచ్చి రెండేళ్లయింది. ఆ సినిమా తర్వాత సంపూర్ణేష్‌ బాబుకు మళ్ళీ అంత హిట్‌ రాలేదు. అందుకే అదే దర్శకనిర్మాతతో  'కొబ్బరిమట్ట'లో నటించాడు. ఇందులో సంపూ చెప్పిన భారీ డైలాగ్‌ను టీజర్‌లో రిలీజ్‌ చేశారు. ఆడదంటే ఎవరనుకున్నావ్‌... అంటూ... మూడు నిమిషాలపాటు ఆపకుండా సంపూ చెప్పిన డైలాగ్‌ను ప్రదర్శించారు. సోమవారం హైదరాబాద్‌లో సాయిధరమ్‌తేజ్‌, మారుతి సంయుక్తంగా విడుదల చేశారు.
 
నిర్మాత సాయి రాజేష్‌ మాట్లాడుతూ..  నేను ఘరానా మొగుడు చూసి మెగా ఫ్యాన్‌గా సినిమా చేశాను. ఆ సినిమా చేసేటప్పుడయినా ఇది హిట్‌ అవుతుందా? కాదా? అనే అనుమానం ఉండేది. కానీ ఈ సినిమా తప్పకుండా హిట్‌ అవుతుంది. రూపక్‌ అద్భుతంగా సినిమా తీశాడు. ఇప్పుడు టీజర్‌లో ఉన్న డైలాగును పెట్టాలా వద్దా! అని చాలా ఆలోచించాను. అయితే ఇంటర్వెల్‌లో మూడు నిమిషాల డైలాగును మగాళ్ల మీద రాశాను. దాంతో దీన్ని టీజర్‌లో పెట్టానని అన్నారు.
 
దర్శకుడు మాట్లాడుతూ.. చాలా లెంగ్తీ డైలాగ్‌ ఇది. రెండు, మూడు పేజీల్లో ఉన్న ఈ డైలాగును చూడగానే సంపూర్ణేష్‌బాబు చెప్పగలడా? అనే అనుమానం వచ్చింది. కనీసం 60 టేకులైనా పడుతుందేమోనని అనుకున్నాం. అయితే సంపూర్ణేష్‌బాబు రెండు మూడు టేకుల్లోనే అంత డైలాగును అనర్గళంగా చెప్పేయడంతో అందరం క్లాప్స్‌ కొట్టి, విజిల్స్‌ వేశామని తెలిపారు.
 
సాయిధరమ్‌ తేజ్‌ మాట్లాడుతూ...   అతి పెద్ద టీజర్‌ను నేను విడుదల చేసినందుకు హ్యాపీగా ఉంది. సంపూర్ణేష్‌ బాబు ఎంత కష్టపడి ఈ స్థాయికి చేరుకున్నాడో తెలుసుకుని ఆయన మీద గౌరవం పెంచుకున్నానని చెప్పారు. సంపూర్ణేష్‌ బాబు మాట్లాడుతూ... 'హృదయకాలేయం' చిత్రాన్ని చూసి మారుతి నాకు ఫోన్‌ చేసుకుని పిలిపించి హగ్‌ చేసుకున్నారు. సాయి ధరమ్‌తేజ్‌కి ఒక మెసేజ్‌ పెట్టి వెళ్లి కలవగానే ఈ ఫంక్షన్‌కి రావడం ఆనందంగా ఉంది. సాయి చేతుల మీదుగా టీజర్‌ విడుదల కావడం చిరంజీవి చేతుల మీదుగా అయినంత ఆనందంగా ఉందని చెప్పారు.
 
ఈ చిత్రానికి కథ-మాటలు-స్క్రీన్‌ప్లే: స్టీవెన్‌ శంకర్‌, కెమెరా: ముజీర్‌ మాలిక్‌, సంగీతం: సయ్యద్‌ కామ్రాన్‌, ఎడిటింగ్‌: కార్తీక్‌ శ్రీనివాస్‌, ఆర్ట్‌: శివ కామేష్‌, ఎగ్జిక్యూటివ్‌ నిర్మాత: శేఖర్‌ అలవలపాటి, లైన్‌ ప్రొడ్యూసర్‌: సురేష్‌ కానగంటి, స్టంట్స్‌ : స్టంట్‌ జాషువా.