గురువారం, 25 ఏప్రియల్ 2024
  1. వినోదం
  2. తెలుగు సినిమా
  3. కథనాలు
Written By pyr
Last Updated : గురువారం, 27 ఆగస్టు 2015 (14:17 IST)

పెరోల్‌పై సంజయ్‌ దత్ విడుదల... 30 రోజులు హ్యాపీగా...

ముంబై పేలుళ్ల కేసులో పుణె ఎర్రవాడ జైలులో ఐదేండ్ల శిక్ష అనుభవిస్తున్న సినీనటుడు సంజయ్‌దత్ 30 రోజుల పెరోల్‌పై బుధవారం సాయంత్రం విడుదలయ్యారు. తన కూతురు ఇక్రా అనారోగ్యంతో బాధపడుతున్నదని, ఆమె సర్జరీ కోసం పెరోల్ మంజూరు చేయాలని సంజయ్‌దత్ చేసుకొన్న విజ్ఞప్తికి జైలు అధికారులు సానుకూలంగా స్పందించారు. 
 
కుటుంబంతో నూతన సంవత్సర వేడుకల్ని జరుపుకునేందుకు గత డిసెంబర్‌లో పెరోల్ పైన విడుదలైన సంజయ్.. 14 రోజుల తర్వాత జనవరిలో తిరిగి ఎర్రవాడ జైలుకు చేరుకున్న సంగతి తెలిసిందే. మ‌రోవైపు సంజ‌య్‌కు పెరోల్ మంజూరు చేయ‌డంపై దేశ‌వ్యాప్తంగా ప‌లు విమ‌ర్శ‌లు చెల‌రేగుతున్నాయి.