గురువారం, 25 ఏప్రియల్ 2024
  1. వినోదం
  2. తెలుగు సినిమా
  3. కథనాలు
Written By CVR
Last Updated : మంగళవారం, 25 ఆగస్టు 2015 (14:34 IST)

పవన్ పుట్టినరోజుకి స్పెషల్ ట్రీట్... ‘సర్దార్’ టీజర్ విడుదల

పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ నటిస్తున్న తాజా చిత్రం 'సర్దార్'. బాబీ దర్శకత్వంలో తెరకెక్కుతున్న ఈ చిత్రం ఫస్ట్‌ లుక్ పోస్టర్‌ని స్వాతంత్ర దినోత్సవం సందర్భంగా విడుదల చేశారు. దానికి ప్రేక్షకుల నుంచి అమిత స్పందన లభించింది. దీంతో ఆ చిత్రపై అంచనాలు భారీ స్థాయికి చేరుకున్నారు. ఇప్పుడు ఈ సినిమా టీజర్‌ని విడుదల చేయడానికి సన్నాహాలు చేస్తున్నారట.

అది కూడా పవన్ పుట్టిన రోజు సందర్భంగా సెప్టంబర్ రెండో తేదిన ఫ్యాన్స్‌కు స్పెషల్ ట్రీట్‌గా విడుదల చేసేందుకు ప్లాన్ చేస్తున్నారని సమాచారం. ఇక ఈ మూవీ యొక్క స్క్రిప్ట్‌ను పవన్ చాలా కేర్ తీసుకొని మరి మంచి స్క్రిప్ట్‌ని వచ్చేలా చూసారు. ఈ స్క్రిప్ట్ కోసం సినిమాని స్టార్ట్ చెయ్యడానికి కూడా చాలా రోజులు వాయిదా వేశారు.  శరత్ మారార్ నిర్మాణంలో రూపొందుతున్న ఈ చిత్రంలో పవన్ సరసన కాజల్ హీరోయిన్‌గా నటిస్తుంది.