Widgets Magazine

శ‌ర్వానంద్-సాయి పల్లవిల 'పడి పడి లేచే మనసు'

మంగళవారం, 6 మార్చి 2018 (22:00 IST)

ర‌న్ రాజా ర‌న్, మ‌ళ్లీ మ‌ళ్లీ ఇది రాని రోజు, ఎక్స్‌ప్రెస్ రాజా, శ‌త‌మానం భ‌వ‌తి, మ‌హానుభావుడు... ఇలా వ‌రుస విజ‌యాల‌తో దూసుకెళుతోన్న స‌క్స‌స్‌ఫుల్ హీరో శ‌ర్వానంద్. ఈరోజు శ‌ర్వానంద్ పుట్టిన‌రోజు. ఈ సంద‌ర్భంగా శ‌ర్వా తాజా చిత్రం ఫ‌స్ట్ లుక్ రిలీజ్ చేసారు. హ‌ను రాఘ‌వ‌పూడి ద‌ర్శ‌క‌త్వంలో రూపొందుతోన్న ఈ మూవీకి 'ప‌డిప‌డి లేచే మ‌న‌సు' అనే టైటిల్ పెట్టారు. 
Sarvanand
 
శ‌ర్వానంద్ కెరీర్లో ఎప్ప‌టికీ మ‌ర‌చిపోలేని విధంగా మ‌ళ్లీమ‌ళ్లీ ఇదిరాని రోజు అనే క‌వితాత్మ‌కంగా ఉండే టైటిల్ ఉన్న విష‌యం తెలిసిందే. 
 
ఇప్పుడు తాజా చిత్రానికి కూడా అలాగే క‌వితాత్మ‌కంగా పడి ప‌డి లేచే మ‌న‌సు అనే టైటిల్‌ని పెట్టడం విశేషం. హ‌ను రాఘ‌వ‌పూడి అందాల రాక్ష‌సి అనే ప్రేమ‌క‌థను ఎంత క‌వితాత్మ‌కంగా తీసారో తెలిసిందే. 
 
ఈరోజు రిలీజ్ చేసిన టైటిల్ మరియు ఫ‌స్ట్ లుక్ చూస్తుంటే.. ఇది కూడా మ‌రో క‌వితాత్మ‌క‌మైన ప్రేమ‌క‌థ అని తెలుస్తుంది. ప్రస్తుతం ఈ సినిమా షూటింగ్ కోల్‌కతా, ముంబయిలో జరుగుతోంది. నేపాల్‌లో షూటింగ్ స్టార్ట్ చేయాల‌నుకున్నారు కానీ.. కుద‌ర‌లేదు. శ‌ర్వానంద్ - సాయిప‌ల్ల‌వి జంట స్ర్కీన్‌పై చేసే ప్రేమ సంద‌డితో యువ‌త‌రాన్ని ఎంతవ‌ర‌కు ఆక‌ట్టుకుంటారో చూడాలి.


Widgets Magazine
Widgets Magazine

దీనిపై మరింత చదవండి :  

Loading comments ...

తెలుగు సినిమా

news

'భరత్ అను నేను'... గంటన్నరలో 60 వేల వ్యూస్, 10 వేల కామెంట్లు(వీడియో)

శ్రీమంతుడు చిత్రంతో సూపర్ హిట్ కాంబినేషన్ గా పేరు కొట్టేసిన ప్రిన్స్ మహేష్ బాబు, దర్శకుడు ...

news

జాన్వి పుట్టినరోజు... ఇవాళ శ్రీదేవిని పూర్తిగా మర్చిపోయి ఎంజాయ్ చేయాలట...

ఇవాళ శ్రీదేవి పెద్ద కుమార్తె జాన్వి కపూర్ పుట్టినరోజు. ఆమె 21వ ఏటలోకి ప్రవేశిస్తుంది. ...

news

కన్నీరు పెట్టిస్తున్న ఇర్ఫాన్ ఖాన్ ట్వీట్... రేర్ డిసీజ్‌తో బాధపడుతున్నానంటూ....

బాలీవుడ్ చిత్ర పరిశ్రమకు చెందిన విలక్షణ నటుల్లో ఇర్ఫాన్ ఖాన్ ఒకరు. ఆయన ఓ అరుదైన వ్యాధితో ...

news

నాగార్జున‌తో పోటీప‌డుతోన్న నంద‌మూరి హీరో..!

నాగార్జున‌తో పోటీప‌డుతోన్న నంద‌మూరి హీరో ఎవ‌ర‌నుకుంటున్నారా? విష‌యం ఏమిటంటే... టాలీవుడ్ ...

Widgets Magazine