శుక్రవారం, 29 మార్చి 2024
  1. వినోదం
  2. తెలుగు సినిమా
  3. కథనాలు
Written By pnr
Last Updated : శనివారం, 21 జనవరి 2017 (19:33 IST)

ఓం నమో వేంకటేశాయలో నటించడం అదృష్టం.. శ్రీకృష్ణుడిగా నటించి.. వెంకన్న పాత్రలో?

బుల్లితెర మహాభారతంలో శ్రీకృష్ణ పాత్రధారిగా ఆకట్టుకున్న సౌరభ్ గురించి అందరికీ బాగా తెలిసేవుంటుంది. సౌరభ్ ప్రస్తుతం టాలీవుడ్‌లోకి అడుగుపెట్టాడు. దర్శకేంద్రుడు కె. రాఘవేంద్రరావు, అక్కినేని నాగార్జునతో కల

బుల్లితెర మహాభారతంలో శ్రీకృష్ణ పాత్రధారిగా ఆకట్టుకున్న సౌరభ్ గురించి అందరికీ బాగా తెలిసేవుంటుంది. సౌరభ్ ప్రస్తుతం టాలీవుడ్‌లోకి అడుగుపెట్టాడు. దర్శకేంద్రుడు కె. రాఘవేంద్రరావు, అక్కినేని నాగార్జునతో కలిసి 'ఓం నమో వేంకటేశాయ' చిత్రంలో నటించడం అదృష్టంగా భావిస్తున్నానని నటుడు సౌరభ్‌ జైన్‌ అన్నారు. ఫిబ్రవరి 10న ఈ చిత్రాన్ని ప్రేక్షకుల ముందుకు తీసుకువస్తున్నారు.
 
ఈ సందర్భంగా చిత్రంలో వేంకటేశ్వరస్వామి పాత్రలో నటించిన సౌరభ్‌ మాట్లాడుతూ.. ''ఓం నమో వేంకటేశాయ' నాకు తెలుగులో తొలి సినిమా. ఇంతకంటే ముందు నేను ఓ ఇరానీ సినిమాలో నటించా. హిందీ సీరియల్‌ 'మహాభారత్‌'లో కృష్ణుడు పాత్ర పోషించా. అది చూసిన భారవిగారు దర్శకుడు రాఘవేంద్రరావుగారికి చెప్పడంతో ఆయన నన్ను 'ఓం నమో వేంకటేశాయ'లో నటించమన్నారు. తనను కలిసినప్పుడు వెంకీ పాత్రకు తాను న్యాయం చేయలేమోనని అనిపించింది. అయితే దర్శకుడు మాత్రం సౌరభ్ అంతా నేను చూసుకుంటానని హామీ ఇచ్చారు. అందుకే ఈ సినిమాలో ధైర్యం చేసుకుని నటించానని సౌరభ్ చెప్పుకొచ్చాడు.  
 
చెప్పినట్లుగానే తన పాత్రకు సంబంధించిన అన్ని విషయాలను దగ్గరుండి చూసుకున్నారు. ఆయనతో పనిచేసే అవకాశం జీవితంలో ఒక్కసారి మాత్రమే వచ్చేది. నాగార్జునతో పనిచేయడం మర్చిపోలేని అనుభూతి అని తెలిపాడు. చాలా పెద్ద స్టార్ అయినప్పటికీ హంబుల్‌గా ఉంటారని.. ఇలాంటి ఇద్దరు లెజెండ్స్‌తో పనిచేయడం తన అదృష్టంగా భావిస్తున్నాని చెప్పుకొచ్చాడు.