Widgets Magazine Widgets Magazine
Widgets Magazine

కోచ్చడయాన్ నష్టాలు: లతా రజనీకాంత్‌కు సుప్రీం కోర్టు నోటీసులు..

గురువారం, 1 డిశెంబరు 2016 (10:00 IST)

Widgets Magazine

తమిళ సూపర్ స్టార్ రజనీకాంత్ సతీమణి లతా రజనీకాంత్‌కు సుప్రీం కోర్టు నోటీసులు జారీ చేసింది. కోచ్చడయాన్ సినిమా బకాయిల చెల్లింపు కేసులో చెన్నైకి చెందిన యాడ్‌బ్యూరో సంస్థ దాఖలు చేసిన పిటిషన్‌పై విచారణ జరిపిన కోర్టు లతా రజనీకాంత్‌కు నోటీసులను సిబ్బంది నేరుగా వెళ్లి అందించాలని ఆదేశించింది. ఈ కేసుకు సంబంధించి లతా రజనీకాంత్‌కు పలుసార్లు నోటీసులు జారీ చేసినా.. అవన్నీ తిరిగి వచ్చేయడంతో సుప్రీం కోర్టు ఉత్తర్వులు జారీ చేసింది. 
 
కోచ్చడయాన్ చిత్రం వల్ల నష్టాలు ఎదురైతే తగిన పరిహారం చెల్లిస్తానని లతా రజనీకాంత్ తమకు హామీ ఇచ్చారని, ఆ చిత్రం ఆశించినమేరకు విజయం సాధించకపోవడంతో తమకు భారీగా నష్టాలు వచ్చాయని, కనుక మాట ప్రకారం పరిహారం చెల్లించాలని యాడ్‌బ్యూరో సంస్థ గతంలో హైకోర్టులో కేసు వేసింది. ఆ కేసుపై లతా రజనీకాంత్ స్టే తెచ్చుకున్నారు. నాలుగు వారాల్లో లతా రజనీకాంత్ కౌంటర్‌ అఫిడవిట్‌ను దాఖలు చేయాలని ఆ నోటీసులో ఆదేశించింది. ఈ కేసు తదుపరి విచారణను జనవరి 13వ తేదీకి వాయిదా వేశారు.Widgets Magazine
Widgets Magazine
Widgets Magazine
దీనిపై మరింత చదవండి :  

Loading comments ...

తెలుగు సినిమా

news

నేను రెండు సార్లు అత్యాచారానికి గురయ్యా... అమెరికా నటి ఇవాన్ రేచల్

సెలెబ్రెటీలు తమ వ్యక్తిగత జీవితంలో జరిగే కొన్ని విషయాలను బహిర్గతం చేసేందుకు పెద్దగా ...

news

బాబీలోనా మంత్రగాడి చేతిలో చిక్కుకుందా? గత ఏడాదే పెళ్లైపోయిందట.. మరి కేసు?

శృంగారతార బాబీలోనా నానమ్మ కృష్ణకుమారి స్థానిక పోలీసులను ఆశ్రయించారు. మంత్రగాడి చేతిలో తన ...

news

బన్నీ రికార్డును బ్రేక్ చేసిన రష్మీ.. నీ సొంతం పాటతో యూట్యూబ్‌లో 2కోట్ల 3లక్షల వ్యూస్..

బన్నీ రికార్డ్‌ని రష్మీ తన హాట్ అందాలతో సరికొత్త రికార్డ్ నెలకొల్పింది. గతంలో యూట్యూబ్‌లో ...

news

అనుష్క పెళ్లి ఖాయమేనట... బెంగళూరు వ్యాపారవేత్తతో... ఎవరో అతను?

నటి అనుష్క పెళ్లి చేసుకుంటుందని పలుసార్లు వార్తలు వచ్చాయి. అయితే ఈసారి కచ్చితంగా చేసుకుని ...

Widgets Magazine