గురువారం, 25 ఏప్రియల్ 2024
  1. వినోదం
  2. తెలుగు సినిమా
  3. కథనాలు
Written By Raju
Last Modified: హైదరాబాద్ , బుధవారం, 17 మే 2017 (03:38 IST)

దమ్ములేకపోతే వైభవం లేదు.. బాహుబలి-2 నిర్వచనం ఇదే.. సినిమా చూడకున్నా ఆకాశానికెత్తిన షారుఖ్ ఖాన్

దమ్ము లేకపోతే, సాహసించకపోతే వైభవం ఊరికే రాదని బాహుబలి విజయం నిరూపిస్తోందని బాలీవుడ్ బాద్షా షారుఖ్ ఖాన్ స్పష్టం చేశారు. విచిత్రం ఏమటంటే షారుఖ్ ఖాన్ ఇంతవరకు బాహుబలి-2ని చూడలేదట. అయినా సరే బాలీవుడ్ బాక్సాఫీసును సునామీలా తాకిన బాహుబలి 2 సినిమా తానాశిస్తు

దమ్ము లేకపోతే, సాహసించకపోతే వైభవం ఊరికే రాదని బాహుబలి విజయం నిరూపిస్తోందని బాలీవుడ్ బాద్షా షారుఖ్ ఖాన్ స్పష్టం చేశారు. విచిత్రం ఏమటంటే షారుఖ్ ఖాన్ ఇంతవరకు బాహుబలి-2ని చూడలేదట. అయినా సరే బాలీవుడ్ బాక్సాఫీసును సునామీలా తాకిన బాహుబలి 2 సినిమా తానాశిస్తున్న మార్పులను అద్బుతంగా ప్రదర్శిస్తోందని షారుఖ్ అభిప్రాయపడ్డారు. భారతీయ సినిమా నూతన శిఖరాలను అందుకోవాలంటే టెక్నాలజీకి అధిక ప్రాధాన్యత ఉందని షారూక్ నిత్యం చెబుతుంటాడు. ఆ వాస్తవాన్ని బాహుబలి-2 సకాలంలో చాటి చెప్పిందని షారుఖ్ అభిప్రాయపడ్డాడు.
 
బాహుబలి తొలి భాగాన్ని చూశాను. దురదృష్టవశాత్తూ రెండో భాగాన్ని ఇంకా చూడలేదు. నిజంగా అది అత్యంత స్ఫూర్తి దాయక సినిమా. రెండోభాగం కూడా ఆ స్పూర్తిని కొనసాగించిందనే అనుకుంటున్నాను. ఏ సినిమానైనా నంబర్లతో చూడలేం. దాని దార్శనికతే ఆ చిత్రం గొప్పతనాన్ని చూపుతుంది. ఆ దార్శనికత ఏమిటో ఆలోచించండి మరి. దమ్ము లేకుంటే వైభవం రాదు. ఈ సత్యానికే బాహుబలి నిదర్శనంగా నిలుస్తుంది అని షారుఖ్ వ్యాఖ్యానించారు. 
 
టెక్నాలజీకి సినిమాలో అత్యంత ప్రాధాన్యత ఉంది. టెక్నాలజీకి సంబంధం లేని ఇతర సినిమాల పాత్రను నేను తక్కువ చేసి చూడటం లేదు. టెక్నాలజీ ప్రవేశించక ముందు కూడా మనం అద్భుతమైన సినిమాలు తీసాం. అవి ఎంతో మంచి సినిమాలు. అద్భుతమైన సినిమాలు. కానీ మీరు భారీ సినిమాను సృష్టించాలంటే, ఆ గొప్ప స్వప్నం అసంఖ్యాక ప్రజలకు చేరువ కావాలంటే, అంతటి భారీ కథాకథనాన్ని చేపట్టడానికి ముందుగా మీకు దమ్ములుండాలి. అది కూడా భారీగా, అతిచక్కగా, సాహసోపతంగా చెప్పగలగాలి. బాహుబలి ఆ అంశంవైపే నిలబడింది. ఈ ఘనతకు అది అర్హమైందని షారుఖ్ ఖాన్ చెప్పారు.
 
మనందరికీ అలాంటి దార్శనికత అవసరం. బాహుబలి విజయాన్ని చూసి నేనీ మాటలనడం లేదు. బాహుబలి తొలిభాగాన్ని ఒక దర్శకుడు తీసారు. ఎస్ఎస్ రాజమౌళి ఎప్పటికీ స్పూర్తి కలిగిస్తూనే ఉంటారు. ఏ సినిమా తీసినా సరే.. దాంట్లో ఏదో ఒక రకమైన స్ఫూర్తి ఉంటుంది. బాహుబలి విజయం ప్రతి నిర్మాతనూ కదిలిస్తుంది, స్ఫూర్తిని రగిలిస్తుంది అని షారుఖ్ ముగించారు.