శనివారం, 20 ఏప్రియల్ 2024
  1. వినోదం
  2. తెలుగు సినిమా
  3. కథనాలు
Written By Selvi
Last Updated : శుక్రవారం, 12 ఫిబ్రవరి 2016 (12:03 IST)

షారూఖ్‌కు కొత్త చిక్కు, రూ.1.93 లక్షల జరిమానా ఎందుకు?: ఖాన్ త్రయానికి కష్టాలే కష్టాలు!

బాలీవుడ్ ఖాన్ త్రయానికి కష్టాలు తప్పట్లేదు. సల్మాన్ ఖాన్‌ను హిట్ అండ్ రన్ కేసు వెంటాడుతుంటే.. అమీర్ ఖాన్, షారూఖ్ ఖాన్ అసహనం వ్యాఖ్యలతో కష్టాలు కొనితెచ్చుకున్నారు. ఇవి చాలదంటూ ప్రస్తుతం బాలీవుడ్ బాద్ షా షారూఖ్ ఖాన్‌కు కొత్త చిక్కొచ్చిపడింది.

అధికారుల నుంచి ఎలాంటి అనుమతులు తీసుకోకుండా తన ఇంటి ముందు ర్యాంప్ నిర్మించాడనే ఆరోపణలతో షారూఖ్ ఖాన్‌కు రూ.1.93 లక్షల జరిమానా విధించినట్లు ముంబై మునిసిపల్ కార్పొరేషన్ అధికారులు షాకిచ్చారు. 
 
బాంద్రాలోని తన ఇంటివద్ద గత ఏడాది ఫిబ్రవరిలో షారూఖ్ ఖాన్ ర్యాంప్ నిర్మించగా, అప్పట్లోనే బీఎంసీ నోటీసులు కూడా జారీ చేసింది. అయితే దాన్ని తొలగించని పక్షంలో.. తాము కల్పించుకోవాల్సి వస్తుందని కూడా హెచ్చరికలు పంపింది. దీనిపై షారూక్ స్పందించక పోగా, ఫిబ్రవరి 15న అధికారులు స్వయంగా రంగంలోకి దిగి ర్యాంపును కూలగొట్టడంతో పాటు గవర్నమెంట్ స్థలంలో షారూఖ్ నిబంధనలకు విరుద్ధంగా నిర్మాణాలు చేపట్టారని పేర్కొన్నారు. అంతేగాకుండా ఈ చర్యకుగాను జరిమానా విధించినట్లు కార్పొరేషన్ అధికారులు తెలియజేశారు.