శుక్రవారం, 29 మార్చి 2024
  1. వినోదం
  2. తెలుగు సినిమా
  3. కథనాలు
Written By Selvi
Last Updated : బుధవారం, 25 నవంబరు 2015 (13:30 IST)

బాహుబలిని బ్రేక్ చేసిన షాహిద్ కపూర్ బెడ్ రూమ్ ఫోటో!

బాహుబలి రికార్డును షాహిద్ కపూర్ బెడ్ రూమ్ ఫోటో బ్రేక్ చేసింది. బాలీవుడ్ లవర్ బాయ్ షాహిద్ కపూర్ తన సతీమణి రాజ్‌పూత్‌తో కలిసి దిగిన ఓ ఫోటోని సోమవారం రాత్రి తన ఫేస్‌బుక్ ద్వారా అభిమానులతో షేర్ చేసుకున్నాడు. ఈ ఫోటో ఎంతగా పాపులర్ అయ్యిందంటే.. కేవలం 24 గంటల్లో ఆ ఫోటోకు 12 లక్షల లైక్స్ వచ్చాయి. అంతేకాకుండా 5,500 మంది ఈ ఫోటోని తమ స్నేహితులతో షేర్ చేసుకోగా ఆ ఫోటోపై 10 వేలకుపైగా కామెంట్స్ వచ్చాయి.
 
ఎక్కువమంది నెటిజన్లు ఈ జంటను ప్రశంసించగా.. మరికొందరు ద్వందార్థాలతో కామెంట్లు చేశారు. తద్వారా ఈ ఫోటో వెబ్ మీడియాకు హాట్ టాపిక్‌గా మారింది. ఇంతవరకు బాగానే ఉన్నా ఈ బెడ్ రూమ్ ఫోటో ఏకంగా ప్రభాస్ ‘బాహుబలి’ రికార్డులను లైక్స్ విషయంలో బ్రేక్ చేసింది. ఈ మధ్య ప్రభాస్ ఫేస్ బుక్‌లో ‘బాహుబలి’ సినిమాలో జలపాతం దగ్గర ప్రభాస్ నుంచుని ఉన్న ఫోటోను పెట్టారు.
 
ఈ ఫోటోకు దాదాపు నాలుగున్నర లక్షల లైక్స్ వచ్చాయి. ఈ రికార్డులను చూసి ప్రభాస్ అభిమానులు మురిసిపోయారు. అయితే ఇది జరిగి కొద్ది రోజులు గడవకుండానే టాలీవుడ్ యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్ రికార్డును బాలీవుడ్ లవర్ బాయ్ షాహిద్ కపూర్ బ్రేక్ చేయడం విశేషం.