శుక్రవారం, 19 ఏప్రియల్ 2024
  1. వినోదం
  2. తెలుగు సినిమా
  3. కథనాలు
Written By Selvi
Last Updated : శుక్రవారం, 4 సెప్టెంబరు 2015 (15:57 IST)

చిరు 150వ సినిమా-రోబో 2 సేమ్ టు సేమ్: ఇదిగో పులి అంటే అదిగో తోక..!?

శంకర్ దర్శకత్వంలో రోబో 2 ఎప్పుడు మొదలవుతోందోనని అభిమానులు ఆత్రుతతో ఎదురుచూస్తున్నారు. మెగాస్టార్ చిరంజీవి 150వ సినిమా తరహాలోనే రోబో 2 కూడా ఇదిగో పులి అంటే అదిగో తోక అన్న చందంగా సాగుతోంది. ఇప్పటికే రజనీకాంత్ పి.ఎ.రంజిత్ దర్శకత్వంలో 'కబాలి' చిత్రంలో నటిస్తున్నారు. ఈ సినిమా పూర్తయ్యే సరికి ఈ ఏడాది గడిచిపోతుంది. ఇక రోబో2 సీక్వెల్ ఈ ఏడాదిలో ప్రారంభమయ్యే అవకాశం లేదని కోలీవుడ్ పండితులు జోస్యం చెప్తున్నారు. 
 
ఈ నేపథ్యంలో రోబో 2 రచయిత బి.జేయ మోహన్ చెప్పిన వివరాల ప్రకారం.. ప్రస్తుతం స్క్రిప్టు వర్క్ ఫైనల్ అయ్యిందన్నారు. 2010లో రిలీజైన రోబోకి సీక్వెల్‌గా తీసే ఈ సినిమా కథ ఎక్కడ ఎండ్ అయ్యిందో అక్కడి నుంచే మొదలవుతుంది. 2015 చివరిలో సెట్స్ పైకెళ్తుందని చెప్పుకొచ్చారు. 
 
ఈ సినిమాలో ప్రస్తుతానికి రజనీ మాత్రమే ఎంపికయ్యారని.. విక్రమ్ నటిస్తారా అనేది ఇంకా ఫైనల్ కాలేదని మిగిలిన నటీనటుల వివరాలు త్వరలోనే వెల్లడి కానున్నట్లు మోహన్ చెప్పారు. కమల్ హాసన్ పాపనాశం తర్వాత జేయమోహన్ ఈ చిత్రానికి స్క్రిప్టు అందిస్తున్నారు.