Widgets Magazine Widgets Magazine
Widgets Magazine

బాలీవుడ్ దిగ్గ‌జ న‌టుడు శ‌శిక‌పూర్ మృతి

సోమవారం, 4 డిశెంబరు 2017 (18:26 IST)

Widgets Magazine
Shashi Kapoor

బాలీవుడు నటుడు, పద్మభూషణ్ అవార్డు గ్రహీత శశికపూర్ ఇకలేరు. ఆయన సోమవారం కన్నుమూశారు. ఆయన వయసు 79 యేళ్లు. గతకొంతకాలంగా అనారోగ్యంతో బాధ పడుతూ వచ్చిన ఆయన ఆస్పత్రిలో చికిత్స పొందుతూ తుదిశ్వాస విడిచారు. ఆయ‌న‌కు ముగ్గురు పిల్ల‌లు ఉన్నారు. శశికపూర్ మృతిపట్ల పలువురు బాలీవుడ్ ప్రముఖులు సంతాపం తెలిపారు. 
 
1938 మార్చి 18న కోల్‌క‌తాలో శ‌శిక‌పూర్ జ‌న్మించారు. 1941 నుంచి ప్రారంభ‌మైన ఆయ‌న న‌ట ప్ర‌స్థానం 1999 వ‌ర‌కు కొన‌సాగింది. సంగ్రామ్ (1950), దనపాణి (1953) లాంటి వ్యాపారాత్మక చిత్రాల్లో బాల నటుడిగా తన ప్రస్థానం ప్రారంభించారు. న‌టుడిగానే కాకుండా ద‌ర్శ‌కుడిగా, నిర్మాత‌గా ఆయ‌న రాణించారు. 
 
హిందీ ఫిల్మ్ ఇండస్ట్రీలో డైరెక్టర్, అసిస్టెంట్ డైరెక్టర్‌గా పని చేశారు. సినిమా రంగానికి ఆయన అందించిన సేవలకుగానూ 2011లో పద్మభూషణ్ అవార్డుతో శశికపూర్‌ను భారత ప్రభుత్వం సత్కరించింది. 2015లో దాదాసాహెబ్ ఫాల్కే అవార్డు, 2010లో ఫిల్మ్‌ఫేర్ జీవిత సాఫల్య పుర‌స్కారం, 1994లో నేష‌న్ ఫిల్మ్ అవార్డులు వరించాయి. దివార్, కభీకభీ, సిల్‌సిలా, అవారా, సత్యం శివం సుందరం, నమక్ హలాల్, కాలపత్తర్, రోటి కప్‌డా ఔర్ మకాన్ లాంటి హిట్ సినిమాల్లో శశికపూర్ నటించి విశేష ఆదరణ పొందారు. Widgets Magazine
Widgets Magazine
Widgets Magazine
దీనిపై మరింత చదవండి :  

Loading comments ...

తెలుగు సినిమా

news

బాబాయ్ టైటిల్‌తో అబ్బాయి సినిమా... మెగా ఫ్యాన్స్ వార్?

పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ సినీ కెరీర్‌ను ఓ మలుపుతిప్పిన చిత్రం "తొలిప్రేమ". తెలుగు సినీ ...

news

మాటల మాంత్రికుడి వెంటపడ్డ ఛార్మి...

డ్రగ్స్ కేసు తరువాత ఛార్మి సినీ తెరపై కనిపించకుండాపోయారు. సినీ పరిశ్రమలో తనకు అత్యంత ...

news

డబ్బులు తీసుకుని పవన్‌ను పొగడలేదు.. ఓ కూజా, మట్టిగ్లాసు పెట్టుకుని?

పవర్ స్టార్ పవన్ కల్యాణ్‌పై కమెడియన్ పృథ్వీ ప్రశంసల వర్షం కురిపించారు. తనను చూసి పవన్ ...

news

శ్రీవారి సేవలో చెర్రీ - ఉపాసన... కొణిదెల వారింట శుభవార్త?

టాలీవుడ్ మెగా పవర్ స్టార్ రాం చరణ్, ఆయన సతీమణి, అపోలో ఆస్పత్రి గ్రూప్ వైస్ ప్రెసిడెంట్ ...

Widgets Magazine