బుధవారం, 24 ఏప్రియల్ 2024
  1. వినోదం
  2. తెలుగు సినిమా
  3. కథనాలు
Written By DV
Last Modified: గురువారం, 22 సెప్టెంబరు 2016 (16:01 IST)

బాహుబలి 2కి బిగ్ షాక్... బాహుబలి పార్ట్‌ 2 కథ లీక్... ఇదేనంటూ ప్రచారం...

బాహుబలిని కట్టప్ప ఎందుకు వెన్నుపోటు పొడిచాడు.. ఆ తర్వాత ఏమయింది? అంటూ సీక్వెల్‌ను ఆసక్తికరంగా చూపించిన దర్శకుడు రాజమౌళి.. తన తర్వాత భాగం ఎలా వుంటుందనేది ప్రజలకు వదిలేశాడు. కాగా బాహుబలి-2 ఇలా వుంటుందని.. పలువురు పలురకాలుగా.. చెబుతూనే వున్నారు. అయితే గ

బాహుబలిని కట్టప్ప ఎందుకు వెన్నుపోటు పొడిచాడు.. ఆ తర్వాత ఏమయింది? అంటూ సీక్వెల్‌ను ఆసక్తికరంగా చూపించిన దర్శకుడు రాజమౌళి.. తన తర్వాత భాగం ఎలా వుంటుందనేది ప్రజలకు వదిలేశాడు. కాగా బాహుబలి-2 ఇలా వుంటుందని.. పలువురు పలురకాలుగా.. చెబుతూనే వున్నారు. అయితే గురువారం నాడు అసలు కథ ఇలా వుంటుందనేది బయటకు వచ్చింది. ఎలా వచ్చింది? ఎవరు చెప్పారనే దానికంటే.. ముందుగానే కథను రివీల్ చేస్తే... దాన్ని ఎలా తీశాడనే ఆసక్తితో ప్రేక్షకులుంటారనే.. లాజిక్‌తోనే చిత్ర యూనిట్‌ విడుదల చేసిందా? అన్నంతా కథ వుంది.. అదేమిటో చూద్దాం.
 
బాహుబలి పార్ట్‌ -1 క్లైమాక్స్‌‌లో కట్టప్ప, అమరేంద్ర బాహుబలిని వెన్నుపోటు పొడిచానని చెప్పటంతో ఆ భాగం పూర్తవుతుంది. దాని తర్వాత కట్టప్ప మిగిలిన స్టోరీ శివుడు(ప్రభాస్‌)కి చెబుతాడు. కాలకేయ రాజ్యం మీద గెలిచి విజయ జెండా ఎగరవేసిన మాహిష్మతి రాజ్యానికి రాజుగా అమరేంద్ర బాహుబలి అవుతాడు. మరోవైపు కన్న కొడుకు(భల్లలా దేవా)కి అన్యాయం జరిగింది అని బిజ్జల దేవ్‌ (నాజర్‌) కోపంతో రగిలి పోతారు. 
 
అమరేంద్ర బాహుబలి పాలనలో మాహిష్మతి రాజ్యం సంతోషంగా వుంటారు. మాహిష్మతి రాజ్యానికికి దగ్గరలో వున్న కుంతలా రాజ్యం మీద చిన్నచిన్న రాజ్యాలు దండెత్తుంటాయి. కుంతల రాజ్యాని కాపాడుకొనే దేవసేన(అనుష్క) ఆ రాజ్యంలో ఆమె చెప్పిందే చట్టం. శత్రు బలగాల్ని ఒంటి చేత్తో మట్టి కరిపించే ధైర్యశాలి. అనుకోని సంఘటనలో దేవాసేనని అమరేంద్ర బాహుబలి చూడటంతో వారి మధ్య ప్రేమ మొదలవుతుంది. మరోవైపు ఆ విషయం తెలుసుకున్న భల్లలా దేవా కూడా అనుష్కని ఇష్టపడతాడు. 
 
కొడుకు మనసుపడ్డ విషయం బిజ్జల దేవ్‌కి తెలుస్తుంది. వెంటనే కుంతల రాజ్యానికి వర్తమానం పంపిస్తాడు.. దానికి దేవసేన నిరాకరిస్తుంది. బిజ్జలా దేవ... శివగామితో 'నీ సోంత కొడుకు భల్లలా దేవని రాజును చేస్తావని ఆ రోజు అన్నావు. కానీ మాట తప్పావు.. ఇప్పుడు మన కొడుకుకి ఇష్టమైన ఆ దేవసేన కూడా నువ్వు పెంచిన అమరేంద్ర బాహుబలి ఇష్టపడుతున్నాడు' అని లోపల బాధను వ్యక్తం చేస్తాడు. 
 
ఎటువంటి నిర్ణయం తీసుకోవాలో అర్థం కాని పరిస్థితిలో శివగామి ఆలోచనలో పడుతుంది. మరోవైపు మాహిష్మతి రాజ్యం చేతిలో ఓడిపోయినా కాలకేయ తమ్ముడు నింజా(చరణ్‌ దీప్‌) పగతో రగిలిపోతుంటాడు. కుంతల రాజ్యం నుండి విధేయుడు (సుబ్బరాజు) వర్తమానాన్ని మాహిష్మతి రాజ్యానికి తీసుకువస్తాడు. బిజ్జల దేవా పంపిన వర్తమానాన్ని కుంతల రాజ్యం దేవసేన తండ్రి తిరస్కరిస్తునట్టు విదేయుడు చెబుతాడు. ఆ సభలో భల్లలా దేవా కోపంతో విదేయుడు మీద దాడి చెయ్యటానికి దిగుతాడు. ఆ సమయంలో అమరేంద్ర బాహుబలి విధేయుడి(సుబ్బరాజు)కి అడ్డంవచ్చి విధేయుడిని కాపాడుతాడు. 
 
ఇదే అదను అనుకుని బిజ్జలా దేవా సభలో మళ్ళీ ఆ గొడవని రేపుతాడు. శివగామి అక్కడ జరుగుతుంది అంత చూస్తూ వుంటుంది. ఈ విషయం నా తల్లి శివగామికి వదిలేస్తున్నానని... అమరేంద్ర బాహుబలి అంటాడు. సభలో శివగామి తీర్పు కోసం అందరూ ఎదురుచూస్తూ వుంటారు. శివగామి రాజ్యం కావాలా! ప్రేమ కావాలో! తేల్చుకోమని.. అమరేంద్ర బాహుబలికి వదిలేస్తుంది. 
 
బాహుబలి చెప్పే సమాధానం కోసం ఆసక్తిగా వుంటారు. వెంటనే తనకు.. ప్రేమ కావాలని బాహుబలి కోరుకుంటాడు. బాహుబలి తీసుకున్న నిర్ణయం మాహిష్మతి ప్రజలలో ఆందోళన మొదలవుతుంది. మాహిష్మతి ప్రజలంతా బాహుబలి రాజ్యం వదిలి వెళ్ళవద్దని వేడుకొంటారు. మాకు బాహుబలి కావాలి అని, కానీ బాహుబలి మాహిష్మతిని వదిలి అరణ్య వాసం పడతాడు. ఆ విషయం తెలుసుకున్న దేవసేన బాహుబలికి తోడుగా వెళ్తుంది.
 
బాహుబలి బౌద్ధ మఠంలో వుంటూ అక్కడ వున్న వాతావరణంలో దేవసేనని పెళ్లి చేసుకుని జీవనం కొనసాగిస్తూ వుంటాడు. మాహిష్మతి రాజ్యం అంత భల్లలా దేవా(రానా) ఆధీనంలోకి వెళ్తుంది. ఆ విషయం తెలుసుకున్న కాలకేయ రాజ్యానికి రాజైన నింజా (చరణ్‌ దీప్‌) మాహిష్మతి రాజ్యం మీద దాడి చెయ్యటానికి అవకాశం దొరుకుతుంది. మరోవైపు దేవసేన తల్లి అయ్యిందని కుంతల రాజ్యం అందరికి తెలుస్తుంది.
 
అవకాశం కోసం ఎదురుచూస్తున్న కాలకేయ సైన్యం మాహిష్మతి రాజ్యంపై యుద్ధం ప్రకటిస్తుంది. ఆ యుద్ధంలో మాహిష్మతి రాజ్యానికి (భల్లలా దేవ్‌) రానా నాయకత్వం వహిస్తాడు. యుద్ధ రణరంగ భూమిలో మొదటి రెండు దినాలు మాహిష్మతి రాజ్యంలో సగం సైన్యం కాలకేయ చేతిలో నేల కూలతారు. ఇంకో రెండు రోజుల్లో మాహిష్మతి రాజ్యం కుప్పకూలిపోతుందని తెలుసుకున్న శివగామి బాహుబలికి వర్తమానం పంపిస్తుంది.
 
విషయం తెలుసుకున్న బాహుబలి తన భార్యతో కలసి మాహిష్మతి రాజ్యానికి వస్తాడు. కుంతల రాజ్యం మాహిష్మతి రాజ్యానికి సహాయం చేస్తుంది. మరోవైపు బిజ్జల దేవా(నాజర్‌), బాహుబలి మళ్ళీ తిరిగి వస్తే తన కొడుకుని రాజ్యం నుండి తప్పిస్తారని భావిస్తాడు. భల్లాల దేవకు కాలకేయ చేతిలో ఓడిపోతాం అన్న భయం కంటే తన అన్న తిరిగి వచ్చాడన్న భయం ఎక్కువవుతుంది.
 
అప్పుడు మాహిష్మతి రాజ్యానికి నమ్మినబంటుగా పనిచేసే కట్టప్ప (సత్య రాజ్‌).. తన రాజు చెప్పిందే వేదమనుకుని బాహుబలిని వెన్నుపోటు పొడుస్తాడు. ఆ యుద్ధ భూమిలో బాహుబలి చనిపోతాడు. 
 
ఈ వార్త విని మాహిష్మతి రాజ్యం శోక సంద్రంలో వుంటుంది. దేవాసేన 9 నెలలు గర్భవతి అవ్వటం వలన శివగామి చూసుకుంటుంది. భల్లాలదేవ... బాహుబలి మీద కోపంతో మాహిష్మతి రాజ్యంలో వున్న ప్రజలని హింస చూపిస్తాడు. తనని కాదని బాహుబలిని పెళ్లి చేసుకున్న దేవసేనని చెరసాలలో బంధిస్తాడు. దేవసేనకి పుట్టిన బిడ్డని శివగామి పెంచుతుంది. బాహుబలి వారసుడిని చంపాలనుకున్న వార్త కట్టప్ప ద్వారా తెలుసుకున్న శివగామి పుట్టిన బిడ్డతో రాజ్యం నుండి పారిపోతుంటే భల్లలా దేవ సైన్యం శివగామిని చంపటానికి ట్రై చేస్తుంటారు. ఆ పోరులో శివగామి ఆ పిల్లవాడిని రక్షించి చనిపోతుంది.. అక్కడితో కట్టప్ప బాహుబలికి జరిగిన అన్యాయం గురించి శివుడికి చెబుతాడు.
 
భల్లలా దేవా శివుడు మీద పగతో రగిలిపోతుంటాడు. తన కొడుకు(భద్రుడు)ని చంపిన శివుడు మీద పగతో వున్నా భల్లాల దేవా, మరోవైపు తన భర్త (బాహుబలి) చావుకి కారణం అయిన భల్లాలదేవని చంపుతానని శపథమ్‌ చేసిన దేవసేన కసితో వుంటారు. శివుడు తనకంటూ ఒక రాజ్యాన్ని ఏర్పాటు చేసుకుంటాడు. ఆ రాజ్యంలో కుంతలా రాజ్యం తోడూ అవుతుంది.. శివుడికి నమ్మినబంటుగా కట్టప్ప వుంటే, వాళ్ళకి ఆయుధాలు సరపరా చేసే వ్యక్తిగా కిచ్చా సుదీప్‌ సహాయం చేస్తాడు. మాహిష్మతి రాజ్యానికి, శివుడికి మధ్య జరిగే పోరులో మాహిష్మతి రాజు అయిన భల్లలా దేవా శివుడు చేతిలో ఓడిపోతాడు.
 
మాహిష్మతి రాజ్యంలో అందరు చూస్తుండగా భల్లలా దేవా(రానా)ని చితి మీద పేర్చి సజీవ దహనం చేస్తుంది. ఆ బాధ తట్టుకోలేక బిజ్జలా దేవా కొడుకు చితిని చూస్తూ కన్ను మూస్తాడు. ఇదీ కథ. మరి ఇది నిజమో కాదో బాహుబలి 2 వస్తే కాని తెలియదు.