Widgets Magazine Widgets Magazine
Widgets Magazine

ఎన్టీఆర్ 'బిగ్‌బాస్' కూడా 'చెత్తబాస్' అవుతుందా? కమల్ 'బిగ్‌బాస్'పై విరుచుకుపడిన నటి

శనివారం, 8 జులై 2017 (18:04 IST)

Widgets Magazine
kamal-ntr

తమిళంలో కమల్ హాసన్ హోస్టుగా కొనసాగుతున్న బిగ్ బాస్ షోను ఓ చెత్త షో అని తీవ్రంగా విమర్శలు చేసింది తమిళ సీనియర్ నటి, దర్శకురాలు లక్ష్మీ రామకృష్ణన్. ఇది ఓ చెత్త షో అంటూ తేల్చిన లక్ష్మి... భారతదేశ సంస్కృతి, సంప్రదాయాలకు ఇది విరుద్ధమని చెప్పారు. అంతేకాదు... తనకు కూడా ఈ ఆఫర్ వచ్చిందనీ, రూ. 10 కోట్లు ఇచ్చినా ఇందులో పాల్గొనేది లేదని తేల్చి చెప్పింది. 
 
ఈ షో దక్షిణాది ప్రజల మనోభావాలకు విరుద్ధమనీ, ముక్కుమొహం తెలియని వారితో ఎన్నో రోజులు కలిసి వుండటం తాను మాత్రం ఎట్టి పరిస్థితుల్లో జీర్ణించుకోలేననీ, తనకు తెలిసినంతవరకూ దక్షిణాది ప్రజలు ఎవ్వరూ ఇలాంటి షోలను ఆదరించరని వెల్లడించారు. ఇలాంటి షోలతో వ్యక్తిగత సంబంధాలు దెబ్బతింటాయనీ, మన సంప్రదాయలను చేజేతులా చెడగొట్టుకునేవిధంగా ఈ షోలు వున్నాయని అభిప్రాయపడింది. 
 
మగా ఆడా తేడా లేకుండా ఒకే ఇంట్లో అలా రోజుల తరబడి వుండటం పాశ్చాత్య దేశాల్లోనూ, ఉత్తరాదిలోనూ సాధ్యమవుతుందేమో కానీ దక్షిణాదిలో మాత్రం ఎట్టి పరిస్థితుల్లో సాధ్యం కాదనీ, ఈ షో దక్షిణాదిలో క్లిక్ అవుతుందని తను అనుకోవడం లేదని తేల్చేసింది. ఆమె మాటలను చూస్తుంటే జూ.ఎన్టీఆర్ బిగ్ బాస్ కూడా ప్లాప్ అవుతుందనేట్లుగా వున్నాయి. ఏం జరుగుతుందో చూద్దాం.Widgets Magazine
Widgets Magazine
Widgets Magazine
దీనిపై మరింత చదవండి :  

Loading comments ...

తెలుగు సినిమా

news

ఆ హీరోతో సుస్మిత పెళ్లిన చిరంజీవి గ్రాండ్‌గా చేయాలని భావించారు.. అతనే పెళ్లిని ఆపేశాడట...

ఉదయ్ కిరణ్... టాలీవుడ్ యువ హీరో. ఈ హీరో ఆత్మహత్య చేసుకున్నాడు. అయితే, టాలీవుడ్‌లోకి ...

news

బ్రాహ్మణ గెటప్‌లో బన్నీ ఇరగదీశాడంటున్న నందమూరి హీరో

అల్లు అర్జున్ హీరోగా, హరీష్ శంకర్ దర్శకత్వంలో వచ్చిన చిత్ర "డీజే (దువ్వాడ జగన్నాథమ్). ఈ ...

news

ఆ వ్యక్తి చెప్పడం వల్లే బిగ్‌బాస్ షో చేస్తున్నా.. రెమ్యునరేషన్ అంతకాదులెండి : జూ.ఎన్టీఆర్

బిగ్ బాస్ షో చేయడానికి ఎవరు కారణమన్న విషయాన్న హీరో జూనియర్ ఎన్టీఆర్ వెల్లడించారు. ...

news

అది కనిపిస్తే ఎక్కడైనా ఆగిపోతా... అనుష్క

'బాహుబలి' తర్వాత అనుష్క క్రేజ్ ఒక్కసారిగా పెరిగింది. ఈ పొడుకాళ్ళ సుందరి మొదట‌లో మాస్ ...

Widgets Magazine