Widgets Magazine

సాహో టీమ్‌కు చుక్కలు చూపించిన బాలీవుడ్ భామలు.. ప్రభాస్ తాజా సినిమాకు అనుష్క ఫిక్స్ అట

హైదరాబాద్, బుధవారం, 17 మే 2017 (07:28 IST)

Widgets Magazine

ప్రభాస్ నటిస్తున్న తాజా చిత్రం సాహోలో బాలీవుడ్ హీరోయిన్లను పెట్టి మరింత మార్కెట్  చేయాలనుకున్న సాహో టీమ్‌కు బాలీవుడ్ తారలు చుక్కలు చూపించినట్లు తెలుస్తోంది. ప్రభాస్ సరనన నటించడానికి ఒకే కాని కనీసం ఎనిమిది కోట్లు ఇవ్వనిదే ఒప్పుకునేది లేదు అనేంత రేంజిలో బాలీవుడ్ హీరోయన్లు బేరమాడటంతో హడలెత్తిపోయిన సాహో టీమ్ వారికంటే తెలుగు హీరోయిన్లే ఎంతో బెటర్ అని డిసైడ్ అయినట్లు తాజా సమాచారం. చివరకు ప్రభాస్ సరసన మళ్లీ నటించే అవకాశం అనుష్కకో, తమన్నాకో దక్కనుందని వినికిడి.
anushka - prabhas
 
‘సాహో’ను తెలుగు, తమిళ, హిందీ, మలయాళ భాషల్లో తీస్తున్న విషయం తెలిసిందే. అందుకని ప్రేక్షకులందరికీ తెలిసిన హిందీ భామను ప్రభాస్‌కు జోడీగా తీసుకోవాలనుకున్నారు కూడా. కానీ, కత్రినా కైఫ్‌ నుంచి శ్రద్ధా కపూర్, కృతీ సనన్, దిశా పాట్నీల వరకు ‘సాహో’ టీమ్‌తో వ్యవహరించిన తీరు చికాకు తెప్పించిందట! పైగా, ‘బాహుబలి–2’లో ప్రభాస్, అనుష్క జోడీను హిందీ ప్రేక్షకులు ఆదరించారు. అనుష్క దక్షిణాది హీరోయినే. కాబట్టి సినిమా హిట్టవ్వాలంటే హిందీ హీరోయిన్‌ అవసరం లేదని దర్శకుడు సుజీత్, చిత్రనిర్మాతలు వంశీ, ప్రమోద్‌లు డిసైడ్‌ అయ్యారని టీమ్‌ సన్నిహితులు చెబుతున్నారు. 
 
‘సాహో’ టీమ్‌ ఫస్ట్‌ ఛాయిస్‌ శ్రద్ధా కపూర్‌! ఆమెకు కథ చెప్పగానే గ్రీన్‌ సిగ్నల్‌ ఇచ్చేసింది. కానీ, రెమ్యునరేషన్‌ 8 కోట్లు అడిగింది. తెలుగులో హీరోయిన్లకు అంత అమౌంట్‌ ఎవరూ ఇవ్వడం లేదు. పైగా, శ్రద్ధా నటించిన ‘రాక్‌ ఆన్‌–2, ఓకే జాను’ బాక్సాఫీస్‌ దగ్గర బోల్తా కొట్టాయి. సో, రేటు కాస్త తగ్గిస్తుందేమో అని ప్రయత్నిస్తే... ‘ఐ లవ్‌ ద స్క్రిప్ట్‌. లవ్‌ టు వర్క్‌ విత్‌ ప్రభాస్‌. కానీ, రెమ్యునరేషన్‌ మాత్రం తగ్గదు’ అని శ్రద్ధా స్పష్టంగా చెప్పడంతో ‘సాహో’ టీమ్‌ శ్రద్ధాకు టాటా చెప్పేశారు’’
 
ఇకపోతే.. ‘‘దిశా పాట్నీ హీరోయిన్‌గా పరిచయమైంది తెలుగులోనే. వరుణ్‌ తేజ్‌ ‘లోఫర్‌’ తర్వాత హిందీలో ‘ఎం.ఎస్‌. ధోనీ’, ఇండో–చైనీస్‌ ఫిల్మ్‌ ‘కుంగ్‌ ఫూ యోగా’ చేసింది. తెలుగు, తమిళ, హిందీ భాషల్లో తీస్తున్న సినిమా కాబట్టి ఆమె చేస్తుందనుకున్నారు. శ్రద్ధా కపూర్‌ తర్వాత ‘సాహో’ టీమ్‌ దిశాను సంప్రదించారు. 5 కోట్ల రెమ్యునరేషన్‌ అడిగిందామె. ‘హిందీలో దిశా పాట్నీకు 5 కోట్లు ఇచ్చే నిర్మాతలు ఎవరు’ అని కూసింత కోపంగానే ‘సాహో‘ టీమ్‌ వెనక్కి వచ్చేసింది’’
 
అందరికంటే ఘోరంగా వ్యవహరించిది కత్రినా కైఫ్ అట. ‘‘బాహుబలి–2’ విడుదలకు ముందు ఆర్నెల్లు ‘సాహో’ టీమ్‌ను కత్రినా కైఫ్‌ తన వెంట తిప్పించుకుంది. ప్రభాస్‌కు జోడీగా నటించడం వల్ల తనకు ఏమాత్రం ఉపయోగం లేదన్నట్టు వ్యవహరించిందట. విసుగొచ్చి ఆమెను హీరోయిన్‌గా తీసుకునే ఆలోచనను పక్కన పెట్టేశారు. ఊహించిన దానికంటే ‘బాహుబలి–2’ భారీ హిట్టవ్వడంతో ‘ప్రభాస్‌ ‘సాహో’లో కత్రినా’ అనే ఫీలర్లను ఆమే తనకు తానుగా విడుదల చేస్తోందని సమాచారం. 
 
మొత్తం మీద చెప్పాలంటే ‘సాహో’లో అనుష్క నటించే ఛాన్స్‌ ఎక్కువుందని అంటున్నారు. ‘మిర్చి’, ‘బాహుబలి’ రెండు భాగాలతో సూపర్ హిట్స్‌ అందుకున్న ఈ జోడీకి ‘బిల్లా’లోనూ మంచి పేరొచ్చింది. పనిలో పనిగా తమన్నా పేరు కూడా వినిపిస్తోంది.  
 
 Widgets Magazine
Widgets Magazine
Widgets Magazine
దీనిపై మరింత చదవండి :  
శ్రద్ధా కపూర్ కత్రినా కైఫ్‌ కృతీ సనన్ ప్రభాస్‌ సాహో Saaho Prabhas Katrina Kaif Kiriti Sanan Shraddha Kapoor

Loading comments ...

తెలుగు సినిమా

news

దమ్ములేకపోతే వైభవం లేదు.. బాహుబలి-2 నిర్వచనం ఇదే.. సినిమా చూడకున్నా ఆకాశానికెత్తిన షారుఖ్ ఖాన్

దమ్ము లేకపోతే, సాహసించకపోతే వైభవం ఊరికే రాదని బాహుబలి విజయం నిరూపిస్తోందని బాలీవుడ్ ...

news

రూ. 500 కోట్ల లక్ష్యం దిశగా బాహుబలి-2: ముంబైలో కరణ్ జోహార్ పార్టీలే పార్టీలు

దర్శక ధీరుడు ఎస్ఎస్ రాజమౌళి తీసిన ప్రతిష్ఠాత్మక చిత్రం బాహుబలి-2 ది కంక్లూజన్ జాతీయ, ...

news

రాజకీయ నేతల్లో బాహుబలి-2 సునామీ.. ఇక్కడా రాజకీయాలే మరి

దేశం దేశం బాహుబలి సినిమా జ్వరంతో వేగిపోతోంది. బాహుబలి చూడని వాడు పాపాత్ముడు లెక్కన నేటికీ ...

news

అడ్డెడ్డే... అల్లు అరవింద్ 'బాహుబలి'ని ఆకాశానికెత్తేశారు... ఆ విషయంలో పవన్‌కు సపోర్ట్...

తెలుగు సినీ ఇండస్ట్రీలో అగ్ర నిర్మాతల్లో ఒకరైన అల్లు అరవింద్ బాహుబలి సృష్టిస్తున్న సునామీ ...