గురువారం, 28 మార్చి 2024
  1. వినోదం
  2. తెలుగు సినిమా
  3. కథనాలు
Written By Selvi
Last Updated : శుక్రవారం, 9 అక్టోబరు 2015 (15:53 IST)

వామ్మో శ్రుతిహాసన్.. ఆ డ్రింక్ తాగి డ్యాన్స్ చేసిందట.. ఏంటది?

శ్రుతిహాసన్‌కు ఈ ఏడాది బాగా కలిసొచ్చింది. వెల్ కమ్ బ్యాక్ అంటూ బాలీవుడ్, శ్రీమంతుడితో టాలీవుడ్‌లో సూపర్ హిట్స్ కొట్టిన శ్రుతిహాసన్.. అదే జోరులో యాడ్స్‌లో తెగ నటిస్తోంది. ఒక్క విజయ్ పులి తప్ప.. వరుస హిట్స్ సాధించిన శ్రుతిహాసన్‌కు సినిమా ఛాన్సులే కాకుండా యాడ్స్ కూడా అమ్మడి దగ్గరికి వచ్చి పడుతున్నాయి. ఫ్యాంటా సాఫ్ట్ డ్రింక్ ఫాంటా యాడ్‌లో శ్రుతిహాసన్ యాక్ట్ చేసి అదరగొట్టింది. ఈ కమర్షియల్ టీవీల్లో టెలికాస్టింగ్ ప్రారంభమైంది. 
 
ట్రాఫిక్ సిగ్నల్స్ ఇస్తున్నట్టుగానే కంపోజ్ చేసిన డ్యాన్స్ భలేగా ఉంది. యాడ్ అంతా శృతి మీదే ఫోకస్ చేసి తీయడం విశేషం. డ్యాన్స్-స్టైలింగ్-గెటప్‌లతో అదరగొట్టేసింది. సౌత్ నుంచి వెళ్లి నేషనల్ బ్రాండ్ అంబాసిడర్‌గా ఎంపిక కావడం, అది కూడా కోకకోలా వంటి మల్టీనేషనల్ కంపెనీకి సైన్ చేయడమంటే మామూలు విషయం కాదని, ఇప్పటికే తెలుగు, తమిళం, హిందీల్లో అనే హిట్స్ ఉండటం శ్రుతికి ప్లస్ అయ్యిందని సినీ పండితులు అంటున్నారు.
 
దీంతో యాడ్లన్నీ శ్రుతిహాసన్ వైపు వచ్చేస్తున్నాయి. లాయిడ్ హోమ్ అప్లయన్సెస్ - ఫిలిప్స్ లైట్స్ - జ్యూవెల్ వన్ జ్యూవెలరీ స్టోరీ - షాపర్స్ స్టాప్‌లకు కూడా శృతిహాసన్ బ్రాండ్ అంబాసిడర్‌గా వ్యవహరిస్తోంది. ఇక సోప్స్-ఫెయిర్ నెస్ క్రీములే పెండింగ్. అవి కూడా వచ్చేస్తే.. యాడ్ ఎండార్సింగ్‌లోనూ శృతి టాప్ రేంజ్‌కి వెళ్ళిపోయినట్టేనని.. దీంతో హీరోల్ని కూడా వెనక్కి నెట్టే ఛాన్సుందని సినీ పండితులు జోస్యం చెప్తున్నారు.