బుధవారం, 24 ఏప్రియల్ 2024
  1. వినోదం
  2. తెలుగు సినిమా
  3. కథనాలు
Written By Selvi
Last Updated : గురువారం, 13 ఏప్రియల్ 2017 (16:47 IST)

శ్రుతిహాసన్ ఫాలోయర్స్ @5మిలియన్లు.. థ్యాంక్స్ చెప్పిన కాటమరాయుడు హీరోయిన్

కాటమరాయుడు సినిమాలో నటించిన గబ్బర్ సింగ్ హీరోయిన్ శ్రుతిహాసన్‌కు సోషల్ మీడియాలో మస్తు ఫాలోయింగ్ వుంది. ఇక, పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ తో కలిసి శృతి చేసిన కాటమరాయుడు ప్రేక్షకుల ముందుకొచ్చిన సంగతి తెలిసిం

కాటమరాయుడు సినిమాలో నటించిన గబ్బర్ సింగ్ హీరోయిన్ శ్రుతిహాసన్‌కు సోషల్ మీడియాలో మస్తు ఫాలోయింగ్ వుంది. ఇక, పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ తో కలిసి శృతి చేసిన కాటమరాయుడు ప్రేక్షకుల ముందుకొచ్చిన సంగతి తెలిసిందే. ప్రస్తుతం తెలుగులో శ్రుతిహాసన్ చేతిలో ఒక్క సినిమా కూడా లేదు. 
 
అయితే తాజాగా, ఆమె ట్విట్టర్ ఫాలోవర్స్ సంఖ్య 5మిలియన్లకు చేరింది. ఐదు మిలియన్లకు తన ఫాలోవర్స్ సంఖ్య పెరగడంతో శ్రుతిహాసన్ తన ఫ్యాన్స్‌కు కృతజ్ఞతలు తెలిపింది. 'థ్యాంక్యూ బ్యూటిఫుల్ పీపుల్ ఫర్ మై ఫై మిలియన్... అంటూ ట్వీట్ చేసింది.
 
ప్రేక్షకుల అభిమానం, ప్రేమ తనకు చాలా ముఖ్యమైందని ట్వీట్ చేసింది. సోషల్ మీడియాలో శ్రుతిహాసన్‌కు మంచి క్రేజ్ వుంది. సినిమా, పర్సనల్ జీవితానికి సంబంధించిన విషయాలని ట్విట్టర్ ద్వారా అభిమానులతో పంచుకునే శ్రుతిహాసన్... ఇటీవల తన ప్రియుడితో దిగిన ఫోటోను పోస్ట్ చేసింది.