శుక్రవారం, 29 మార్చి 2024
  1. వినోదం
  2. తెలుగు సినిమా
  3. కథనాలు
Written By Raju
Last Modified: హైదరాబాద్ , మంగళవారం, 30 మే 2017 (04:49 IST)

బాహుబలికి పోటీ అంటూ వచ్చిన సంఘమిత్ర.. శ్రుతి హసన్ ఔట్.. టీమ్‌కి ఏమైందో మరి

బాహుబలిని తలదన్నే సినిమా చేసి చూపిస్తాం అంటూ తమిళ చిత్ర పరిశ్రమ సగర్వంగా సంఘమిత్ర ప్రాజెక్టును ప్రకటించినప్పుడు అంతా ఔరా అని అబ్బురంగా చూశారు. ఆ చిత్రం షూటింగ్ కూడా ప్రారంభం కాకముందే కేన్స్ ఫెస్టివల్‌లో టీజర్‌తో అదరగొడితే ఏదో అద్భుతమే జరుగనుందని అందర

బాహుబలిని తలదన్నే సినిమా చేసి చూపిస్తాం అంటూ తమిళ చిత్ర పరిశ్రమ సగర్వంగా సంఘమిత్ర ప్రాజెక్టును ప్రకటించినప్పుడు అంతా ఔరా అని అబ్బురంగా చూశారు. ఆ చిత్రం షూటింగ్ కూడా ప్రారంభం కాకముందే కేన్స్ ఫెస్టివల్‌లో టీజర్‌తో అదరగొడితే ఏదో అద్భుతమే జరుగనుందని అందరూ భావించారు. భారతీయ చిత్రపరిశ్రమ చారిత్రక ఇతివృత్తాలవైపు మళ్లడం ఆశాజనకమని అందరూ పొగిడేశారు. కానీ ఇంత మెగా ప్రాజెక్టు నుంచి ఆ చిత్ర కథానాయిక శ్రుతి హసన్ అర్థాంతరంగా తప్పుకున్నట్లు వార్తలు రావడం షాక్ కలిగిస్తోంది. 
 
తమిళ చిత్ర పరిశ్రమ కొలివుడ్ నుంచి అత్యంత ప్రతిష్ఠాత్మకంగా రాబోతున్న సంఘమిత్ర ప్రాజెక్టు నుంచి హీరోయిన్ శ్రుతి హాసన్ తప్పుకొన్నట్లు విశ్వసనీయంగా తెలుస్తోంది. సుందర్ సి. దర్శకత్వంలో, ఆస్కార్ అవార్డు విజేత ఏఆర్ రెహ్మాన్ సంగీత సారథ్యంలో టాప్ టెక్నీషియన్లతో వస్తున్న ఈ సినిమాలో ముఖ్య పాత్రలోనటించడం అంటే చిన్న విషయం కాదు. తమిళ దర్శకుడు సుందర్‌ .సి తెలుగు, తమిళ, హిందీ భాషల్లో సుమారు రూ. 200 కోట్ల బడ్జెట్‌తో తెరకెక్కించనున్న ఈ సినిమాలో శ్రుతి ఫస్ట్‌ లుక్‌ను ఫ్రాన్స్‌లో జరుగుతున్న కేన్స్‌ ఫిల్మ్‌ ఫెస్టివల్‌లో విడుదల చేశారు.
 
వాస్తవానికి సోషియో ఫాంటసీ డ్రామాలలో శ్రుతి నటించి కూడా చాలా కాలమైపోయింది. ఇన్నాళ్లూ స్వీట్‌ అండ్‌ ఇన్నోసెంట్, లేదంటే... బ్యూటిఫుల్‌ అండ్‌ బబ్లీ హీరోయిన్‌గా ఎక్కువ సినిమాల్లో శ్రుతి చేసింది. ఇప్పుడు ఆమెకు ఇది ఒక మంచి అవకాశమని, వారియర్ ప్రిన్సెస్‌గా తనను తాను ప్రూవ్ చేసుకుంటుందని, టైటిల్‌ రోల్‌కు శ్రుతి అయితేనే పెర్ఫెక్ట్‌గా సూట్ అవుతుందని అంతా అనుకున్నారు. ఇంతలో ఏమైందో తెలియదు గానీ, ఆ సినిమా నుంచి ఆమె బయటకు వచ్చేసిందని టాక్ గట్టిగా వచ్చింది. దాంతో ఏమీ చేయలేని చిత్ర యూనిట్ మరో హీరోయిన్‌ను వెతుక్కునే పనిలో పడిందట.
 
నిజం చేదు అయినప్పటికీ సంఘమిత్ర పాత్రధారి శ్రుతిహసన్ అని తెలిసేసరికి తమిళ ప్రేక్షకులు, నెటిజన్లు పెదవి విరిచేశారు. ప్రేమమ్ మలయాళ మాతృకలో సాయి పల్లవి పోషించిన లెక్చరర్ పాత్రను తెలుగులో నాగ చైతన్య సరసన శ్రుతిహసన్ నటించనప్పుడే తమిళ ప్రజానీకం గేలి చేసిపడేసింది. సాయిపల్లవి నటించిన దాంట్లో పది శాతం కూడా నటనను శ్రుతి హసన్ పోషించలేదని అందరూ తిట్టిపోశారు. తనపై వస్తున్న విమర్శలను తట్టుకుని సమర్థించుకోవడానికి అప్పట్లోనే శ్రుతి చాలా తంటాలు పడింది.
 
ఇప్పుడు సంఘమిత్ర వంటి అత్యంత స్త్రీ ప్రాధాన్య చిత్రంలో శ్రుతిహసన్ ముఖ్య పాత్ర పోషిస్తోందని తెలియగానే తమిళ నెటిజన్లు అమె సామర్థ్యంపై తీవ్ర సందేహాలు వెలిబుచ్చారు. గతంలో తెలుగులో అనగనగా ఒక ధీరుడు, తమిళంలో పులి వంటి అతి భారీ చిత్రాల్లో నాయిక పాత్రను పోషించిన శ్రుతి ఎంత చెడ్డపేరు సంపాదించుకోవాలో అంత చెడ్డపేరు సంపాదించుకునేసింది.

ఇప్పుడు తనపై సంఘమిత్ర పాత్ర విషయంలో తనపై వస్తున్న విమర్శలకు జడుసుకుని ఈ ప్రాజెక్టు నుంచి తప్పుకుందా లేక అంత బరువైన పాత్రను దీర్ఘకాలం పాటు పోషించడం తన వల్ల అయ్యే పని కాదని గ్రహించి తప్పుకుందా లేక్ చిత్ర దర్శకుడే ఆమె సామర్థ్యంపై అపనమ్మకంతో ప్యాకప్ చెప్పేశారా.. ఏది నిజమో తెలియడం లేదు.
 
మొత్తం మీద బాహుబలికి పోటీగా చింపేస్తాం అంటూ ముందుకొచ్చిన సంఘమిత్ర యూనిట్‌కు ఇది తొలి అపశకునమే మరి.