Widgets Magazine Widgets Magazine
Widgets Magazine

దిల్ రాజు, మంచు విష్ణు పత్తాలేరు... ఏడిపించేసిన శ్వేతాబసు

శనివారం, 4 నవంబరు 2017 (20:10 IST)

Widgets Magazine

శ్వేతాబసు ప్రసాద్ ఏడిపించేసింది. తను తాజాగా నటించిన చంద్రనందిని సీరియల్ గురించి తన ఇన్‌స్టాగ్రాంలో ఓ పోస్ట్ పెట్టి అందరి హృదయాలను బరువెక్కించింది. శ్వేతా బసు ప్రసాద్ బాలీవుడ్‌లో బాలనటిగా జాతీయ అవార్డు అందుకొని 'కొత్త బంగారు లోకం' సినిమాతో తెలుగు తెరకు ఎంట్రీ ఇచ్చిన భామ. ఆ తర్వాత వ్యభిచారం కేసులో పట్టుబడి తెలుగు చిత్ర పరిశ్రమకు దూరమైంది.
swetha basu
 
అయితే, 'కొత్త బంగారు లోకం' చిత్రంలో ఈ భామకు మంచి పేరు వచ్చినప్పటికీ.. సినీ అవకాశాలు మాత్రం రాలేదు. చివరగా తెలుగులో 'మిక్చర్ పొట్లం' అనే సినిమాలో కనిపించింది. సినిమా అవకాశాలు అంతగా రాకపోవడంతో సీరియల్స్‌ వైపు మళ్లింది. ఆమె హిందీలో ‘చంద్ర నందిని’ అనే సీరియల్‌లో నటించింది. అయితే ఆ సీరియల్ లాస్ట్ ఎపిసోడ్ గురువారమే ముగిసింది. దీంతో అమ్మడు కొంచెం బాధతో ఇన్‌స్టాగ్రామ్‌లో ఓ పోస్ట్ చేసింది. 
 
ప్రతి ప్రయాణానికి ఒక ఎండ్ ఉంటుంది ఆ విధంగానే ‘చంద్ర నందిని’ అనే సీరియల్ కూడా ముగిసింది అంటూ.. చాలా బాధగా ఉందని, చెప్పడానికి కూడా మాటలు రావడం లేదని తెలిపింది. అంతేకాకుండా అవకాశం ఇచ్చిన నిర్మాతతో సహా నటీనటులతో పాటు ప్రొడక్షన్ టీమ్‌కి ధన్యవాదాలు అని పేర్కొంది. 
 
ఇక్కడ చెప్పుకోవాల్సిన మరో విషయం ఏమంటే... శ్వేతాబసు ప్రసాద్ వ్యభిచారం కేసులో పట్టుబడ్డప్పుడు సినీ నిర్మాత దిల్ రాజు, నటుడు మంచు విష్ణు ఆమెకు తమ సినిమాల్లో అవకాశాలు ఇస్తామన్నారు. కానీ ఇప్పటివరకూ ఆ దిశగా ఆమెను సంప్రదించిన జాడ లేదు. మొత్తమ్మీద ఆమెకు అప్పట్లో మాట ఇచ్చిన ఏక్తా కపూర్ మాత్రం అన్నమాట ప్రకారం శ్వేతా బసుకు ఛాన్స్ ఇచ్చింది.Widgets Magazine
Widgets Magazine
Widgets Magazine
దీనిపై మరింత చదవండి :  

Loading comments ...

తెలుగు సినిమా

news

అందులో ఎక్స్‌పీరియన్స్ బాగా సంపాదించా.. శృతి హాసన్

జీరో సైజ్ నడుము.. అందం.. అణుకువ.. అచ్చ తెలుగు అమ్మాయిలో కనిపించే తత్వం.. ఇదంతా కమల్ హాసన్ ...

news

పవన్ - అను కాఫీ తాగుతూ వుంటే త్రివిక్రమ్ సెల్ఫీ .. అదుర్స్...

మాటల మాంత్రికుడు త్రివిక్రమ్. పవర్‌స్టార్ పవన్ కళ్యాణ్ కాంబినేషన్‌లో ఓ చిత్రం ...

news

నేనిలా వున్నా... ప్యారిస్ నుంచి కాజల్ అగర్వాల్ కత్తిలాంటి ఫోజు

సోషల్ నెట్వర్కింగ్ సైట్లు అందుబాటులోకి వచ్చాక సెలబ్రిటీలు తాము ఎక్కడ వున్నదీ, ఏం ...

news

'గరుడవేగ' సూపర్ హిట్... సీక్వెల్ ఉందంటూ టాక్?

హీరో రాజశేఖర్, డైరక్టర్ ప్రవీణ్ సత్తార్ కాంబినేషన్‌లో వచ్చిన చిత్రం "పీఎస్వీ గరుడవేగ". ఈ ...

Widgets Magazine