శుక్రవారం, 19 ఏప్రియల్ 2024
  1. వినోదం
  2. తెలుగు సినిమా
  3. కథనాలు
Written By Selvi
Last Updated : గురువారం, 26 నవంబరు 2015 (12:12 IST)

గోపిచంద్‌తో చిందులేయనున్న బిజినెస్‌మేన్ ఐటమ్ గర్ల్ శ్వేతా భరద్వాజ్!

శ్వేతా భరద్వాజ్ గోపిచంద్ సరసన ఐటమ్ గర్ల్‌గా కనిపించనుంది. మహేష్ బాబు బిజినెస్‌మేన్‌లో 'వియ్ లవ్ బ్యాడ్ బాయ్స్' అంటూ హీటెక్కించిన ఈ భామ గోపీచంద్ కథానాయకుడిగా రూపుదిద్దుకునే 'సౌఖ్యం' సినిమాలో ఐటమ్ గర్ల్‌గా సందడి చేయనుంది. భవ్య క్రియేషన్స్ బ్యానర్ పై నిర్మితమవుతోన్న ఈ సినిమాకి రవికుమార్ చౌదరి దర్శకుడిగా వ్యవహరిస్తున్నాడు.
 
ఈ చిత్రంలో గోపిచంద్ సరసన రెజీనా హీరోయిన్‌గా నటిస్తున్న సంగతి తెలిసిందే. మాస్ ఇమేజున్న గోపిచంద్‌కు మరింత క్రేజ్ లభించేలా అదుర్స్ ఐటమ్ సాంగ్ ఉండాలని దర్శకుడు నిర్ణయించారట. ఈ క్రమంలోనే  'బిజినెస్ మేన్' సినిమాలోని ఐటెమ్‌ గర్ల్‌తో కుర్రకారును ఒక ఊపు ఊపేసిన శ్వేతా భరద్వాజ్‌ను ఎంపిక చేశారు. ఈ పాటే సినిమాకు హైలైట్‌గా నిలుస్తుందని తెలుస్తోంది. డిసెంబర్ 25వ తేదీన ఈ సినిమా రిలీజ్ కానుంది.