గురువారం, 18 ఏప్రియల్ 2024
  1. వినోదం
  2. తెలుగు సినిమా
  3. కథనాలు
Written By Selvi
Last Updated : గురువారం, 11 ఫిబ్రవరి 2016 (17:34 IST)

రాజమౌళికి సమన్లు: కిలికి భాషలో స్మిత పాట.. డ్యాన్స్! 10 లక్షల హిట్స్!!

బాహుబలి చిత్రంలో కాలకేయుల జాతికి చెందిన 'కిలికి' భాషను వాడుతూ గాయని స్మిత రూపొందించిన గీతం యూట్యూబ్‌లో 10 లక్షల హిట్లను దాటింది. ఈ విషయాన్ని బాహుబలి టీమ్ బాగా పంచుకుంది. కిలికి భాషలో తీసిన ఈ పాట ఇంతమందిని చేరడం సంతోషం కలిగిస్తోందని.. దీనిలో తాను భాగం కావడం గర్వకారణమని కిలికి భాషను రూపొందించడంలో కృషిచేసిన మదన్ కార్కే ట్వీట్ చేశారు. "బహా కిలికి రహా కిలికి పిప్పీ ఫిలిపి జివ్లా క్రోయిక్కి ఉన్నో డున్నో మువో చావో డంబా డంబా బుగో కిలిక్కీ..." అంటూ సాగే పాటలో స్మిత స్వయంగా డ్యాన్స్ చేయడం గమనార్హం.
 
ఇదిలా ఉంటే ప్రముఖ దర్శకుడు రాజమౌళికి గురువారం కోర్టు నుంచి సమన్లు జారీ అయ్యాయి. ఓ రియల్ ఎస్టేట్ లావాదేవీ వ్యవహారంలో రాజమౌళి మోసం చేశాడని, భువనేశ్వర్ అనే నిర్మాత కోర్టులో పిటిషన్ దాఖలు చేయడంతో ఈ సమన్లు జారీ అయ్యాయి. తనకు ప్లాటు అమ్ముతానని చెప్పిన రాజమౌళి ఆపై మోసం చేశారన్నది భువనేశ్వర్ రాజమౌళిపై అభియోగాలు నమోదు చేశారు. ఈ పిటిషన్‌ను విచారణకు స్వీకరించిన నాంపల్లి కోర్టు ఈ 24న విచారణకు హాజరు కావాలని రాజమౌళిని ఆదేశించింది.