శనివారం, 20 ఏప్రియల్ 2024
  1. వినోదం
  2. తెలుగు సినిమా
  3. కథనాలు
Written By CVR
Last Updated : శుక్రవారం, 3 జులై 2015 (18:19 IST)

పవర్ స్టార్‌ సినిమాలో సునీత.. పిన్నిగా ఆకట్టుకునేనా..?

గాయనిగాను, డబ్బింగ్ ఆర్టిస్ట్ తన గొంతుతో ఆకట్టుకున్న సునీత ఇక వెండితెరపై నటనతో అభిమానులను ఆకర్షించనుంది. టాలీవుడ్‌లో తన తీపి గొంతుతో పాటల ప్రపంచంలో విహరించే గాయని సునీత. ఈమె పవన్ సినిమాలో నటించనున్నారనే వార్తలు వెల్లడవుతున్నాయి. త్వరలో పవన్ కళ్యాణ్-త్రివిక్రమ్ కాంబినేషన్లో తెరకేక్కబోయే సినిమాలో సునీత నటించనున్నారట.
 
అందులో పవన్ కళ్యాణ్‌కు పిన్నిగా నటించనుందని సమాచారం. అత్తారింటికి దారేది సినిమాలో పవన్‌కు అత్తగా నటించిన నదియా ఆ సినిమాలో మంచి పేరు తెచ్చుకుని, భారీ ఆఫర్లను పొందింది. కాగా ఇప్పుడు సునీత కూడా అదేవిధంగా మంచి ఛాన్స్‌లు కొట్టాలని ఉద్దేశంతోనే ఈ అవకాశాన్ని అంగీకరించినట్లు సమాచారం.

కాగా ప్రస్తుతం పవన్ కళ్యాణ్ గబ్బర్ సింగ్ 2 సినిమాలో నటిస్తున్నాడు. ఈ సినిమా సెట్స్‌పై ఉండగానే త్రివిక్రమ్ సినిమా సెట్స్‌పైకి తీసుకొచ్చేందుకు ప్లాన్ చేస్తున్నట్టు తెలుస్తోంది.