Widgets Magazine Widgets Magazine
Widgets Magazine

బండ్ల గణేష్‌కు ఆరు నెలల జైలుశిక్ష

శుక్రవారం, 24 నవంబరు 2017 (14:27 IST)

Widgets Magazine
Bandla Ganesh

నంది అవార్డులు ఇవ్వడంలో మెగా ఫ్యామిలీకి అన్యాయం జరిగిందని వ్యాఖ్యానించిన ప్రముఖ వ్యాపారవేత్త, సినీ నిర్మాత బండ్ల గణేష్‌కు ఆరు నెలల జైలుశిక్ష ఖరారైంది. ఈ మేరకు ఎర్రమంజిల్ కోర్టు ఆరునెలల జైలు శిక్ష విధిస్తూ..తీర్పు వెలువరించింది. జైలు శిక్షతో పాటు రూ.15లక్షల జరిమానా కూడా విధించింది. 
 
టెంపర్ సినిమాకు కథ అందించిన వక్కంతం వంశీ రూ.25లక్షల రూపాయలకు సంబంధించిన చెక్ బౌన్స్ కేసులో ఇరుపక్షాల వాదనలు విన్న కోర్టు.. బండ్ల గణేష్‌కు ఆరునెలలు జైలుశిక్ష విధించడంతో పాటు షరతులతో కూడిన బెయిల్‌ను న్యాయస్థానం మంజూరు చేసింది.  
 
కాగా.. ఎన్టీఆర్, కాజల్ హీరో హీరోయిన్లుగా పూరి జగన్నాథ్ దర్శకత్వంలో తెరకెక్కిన టెంపర్ సినిమాను బండ్ల గణేష్ పరమేశ్వర ఆర్ట్ ప్రొడక్షన్ బ్యానర్‌పై నిర్మించిన సంగతి తెలిసిందే. నటుడిగా కెరీర్ ప్రారంభించిన బండ్ల గణేష్, రవితేజ హీరోగా తెరకెక్కిన ఆంజనేయులు సినిమాతో నిర్మాతగా మారిన సంగతి తెలిసిందే. ఆపై పవన్ కళ్యాణ్, ఎన్టీఆర్, రామ్ చరణ్ లాంటి స్టార్ హీరోలతో సినిమాలు నిర్మించి బ్లాక్ బస్టర్ నిర్మాతగా గుర్తింపు సంపాదించాడు.Widgets Magazine
Widgets Magazine
Widgets Magazine
దీనిపై మరింత చదవండి :  

Loading comments ...

తెలుగు సినిమా

news

కావ్యమాధవన్‌తో దిలీప్ వివాహేతరసంబంధం.. అందకే ఆ నటిపై?

సినీ నటి కిడ్నాప్, లైంగిక వేధింపుల కేసులో మలయాళ నటుడు దిలీప్‌పై పోలీసులు ఛార్జీషీట్ దాఖలు ...

news

రామ్ గోపాల్ వర్మ- నాగార్జున సినిమాలో దేవసేన

వివాదాస్పద దర్శకుడు రామ్ గోపాల్ వర్మ, అక్కినేని నాగార్జున కాంబోలో తెరకెక్కే కొత్త ...

news

నేను ఎవరి కాలుమీద కాలేసి కూర్చోను: వేణు మాధవ్

సినిమాలకు దూరమై.. తెలుగుదేశం పార్టీలో క్రియాశీలక రాజకీయాల్లోకి దిగిన హాస్య నటుడు ...

news

నెపోలియన్‌ రివ్యూ రిపోర్ట్: నా నీడపోయిందని పోలీస్ స్టేషన్లో కంప్లెంట్..

ఈ కథ మైండ్‌గేమ్‌తో సాగేది. సామాన్యుడికి కాస్త కన్‌ఫ్యూజ్‌గానూ వుంటుంది. కానీ ఇలాంటి ...

Widgets Magazine