బుధవారం, 24 ఏప్రియల్ 2024
  1. వినోదం
  2. తెలుగు సినిమా
  3. కథనాలు
Written By pnr
Last Updated : శుక్రవారం, 27 నవంబరు 2015 (14:30 IST)

అనుష్క 'సైజ్ జీరో' రివ్యూ : ఆ 20 నిమిషాల సెంటిమెంట్ చిత్రానికి హైలెట్

తారాగణం : అనుష్క, ఆర్య, సోనాల్ చౌహాన్, ప్రకాష్ రాజ్, ఊర్వశి, బ్రహ్మానందం.... 
సంగీతం : ఎంఎం కీరవాణి
కథ : కనిక థిల్లాన్
నిర్మాత : ప్రసాద్ వి పొట్లూరి
దర్శకత్వం : ప్రకాష్ కోవెలమూడి
 
టాలీవుడ్ టాప్ హీరోయిన్ అనుష్క ప్రధాన పాత్రలో నటించిన చిత్రం 'సైజ్ జీరో'. ఈ చిత్రం శుక్రవారం ప్రపంచ వ్యాప్తంగా విడుదలైంది. దర్శకేంద్రుడు కె.రాఘవేంద్ర రావు తనయుడు ప్రకాష్ కోవెలమూడి దర్శకత్వం వహించగా, పోట్లూరి వి. ప్రసాద్ నిర్మాణ సంస్థ పి.వి.పి. బ్యానర్‌పై ఈ చిత్రాన్ని నిర్మించారు. ఈ చిత్రంలో సోనాల్ చౌహాన్, ప్రకాష్ రాజ్, ఊర్వశి మరియు బ్రహ్మానందం ఇతర పాత్రలను పోషించారు.
 
ఈ సినిమా కథ మొత్తం అనుష్క చుట్టూనే తిరుగుతుంది. భోజన ప్రియురాలైన స్వీటీ (అనుష్క) చూడటానికి బొద్దుగా ఉంటుంది. బొద్దుగా ఉన్నా చూడటానికి చాలా అందంగా ఉంటుంది. కానీ స్వీటీని పెళ్లి చూపులు చూడటానికి వచ్చిన వారందరు అమ్మాయి చాలా లావుగా ఉందని తిరస్కరిస్తుంటారు. 
 
కానీ అభి (ఆర్య) మాత్రం అనుష్కను చూసినపుడు మాత్రం మాములుగానే రిసీవ్ చేసుకుంటాడు. దాంతో ఆర్యని ప్రేమించడం మొదలు పెడుతుంది. అయితే, అభి మాత్రం అనుష్కను ఒక ఫ్రెండ్‌గానే ట్రీట్ చేస్తుంటాడు. దీనికి కారణం లేకపోలేదు. దాన్ని వెండితెరపైనే చూడాల్సి ఉంది.
 
ఇకపోతే.. ఈ చిత్రం అధిక బరువు అనే సబ్జెక్టుతో తెరకెక్కించారు. మనిషికి శారీరక అందం కంటే మానసిక అందం ముఖ్యమైనదని అభి, అనుష్కలు తమతమ పాత్రల ద్వారా నిరూపించారు. అయితే, ఈ చిత్రంలో అనుష్క పాత్రా చాలా వినోదాత్మకంగా ఉంది. అనుష్క చేసిన కామెడీ బాగా పండింది. అక్కినేని నాగార్జున, రానా దగ్గుబాటి, జీవా, హన్సిక, కాజల్, తమన్నా, శ్రీ దివ్య, రేవతి, మంచు లక్ష్మి, మరియు బాబీ సింహల గెస్ట్ రోల్ వల్ల సినిమా‌లో మంచి వినోదాన్ని పండించాయి. 
 
సైజ్ జీరో చిత్రం ద్వారా మనిషికి ఊబకాయం వల్ల వచ్చే లాభనష్టాలను చాలా సున్నితంగా తెరకెక్కించారు. ఈ చిత్రం ద్వారా మనిషి జీవితం ఆనందంగా సాగడం ముఖ్యం కానీ శారీరకంగా సన్నగా ఉన్నామా లేకా లావుగా ఉన్నామా అనేది ముఖ్యం కాదని చెప్పారు. పైగా, సన్నగా ఉన్న వ్యక్తి లావుగా మారేందుకు, లావుగా ఉన్న వ్యక్తి సన్నబడేందుకు నానా తంటాలు పడుతుంటారనీ, ఇలాంటి వారంతా గ్రహించాల్సింది ఒక్కటే.. దేవుడిచ్చిన శరీర సౌష్టవాన్ని ఆరోగ్యవంతంగా కాపాడుకోవడమేని చెపుతూ.. ఈ చిత్రంలో చివరి 20 నిమిషాల పాటు పండించి సెంటిమెంట్ ప్రేక్షకులను అమితంగా ఆకట్టుకుంది. ఇదే అనుష్క 'సైజ్ జీరో' చిత్రానికి హైలెట్‌గా నిలిచింది. మిగిలిన కథమొత్తం బోర్‌ కొడుతుంది.