శుక్రవారం, 29 మార్చి 2024
  1. వినోదం
  2. తెలుగు సినిమా
  3. కథనాలు
Written By PNR
Last Updated : బుధవారం, 2 సెప్టెంబరు 2015 (18:53 IST)

నా ప్రేయసి జియా ఖాన్‌ను మరిచిపోలేక పోతున్నా.. సూరజ్ పంచోలి

బాలీవుడ్ హీరోయిన్ జియా ఖాన్. అనుమానాస్పద స్థితిలో ఆత్మహత్యకు పాల్పడగా, ఇందులో ఆమె ప్రియుడు సూరజ్ ఖాన్ పంచోలి పాత్ర ఉన్నట్టు ఆరోపణలు వచ్చాయి. ఇదిలావుండగా, సూరజ్ పంచోలీ బాలీవుడ్‌కు హీరోగా పరిచయమవుతున్నాడు. ఈ యువ నటుడి తొలిచిత్రం పేరు హీరో. బాలీవుడ్ నటుడు సల్మాన్ ఖాన్ నిర్మాత. ఈ సినిమా ప్రమోషన్ వర్క్ ప్రస్తుతం జోరుగా సాగుతోంది. 
 
ఈ సందర్భంగా సూరజ్ మాట్లాడుతూ జియా ఖాన్‌ను ఇప్పటికీ మర్చిపోలేకోపోతున్నానని చెబుతున్నాడు. దీనిపై సోషల్ మీడియాలో విమర్శలు వెల్లువెత్తున్నాయి. సినిమా ప్రచారం కోసమే జియా ఖాన్ పేరును వాడుకుంటున్నాడనే ఆరోపణలు చేస్తున్నారు. 
 
దీంతో ఈ విమర్శలపై వివరణ ఇవ్వాల్సిన పరిస్థితి ఏర్పడింది. సినిమా ప్రమోషన్‌లో భాగంగా మీడియా ముందుకు వచ్చిన ప్రతిసారి జియా గురించి అడుగుతున్నారని, అందుకే సమాధానం చెప్పాల్సి వస్తోందన్నారు. మరోవైపు జియా ఖాన్‌ది ఆత్మహత్య కాదు, హత్య అని ఆరోపణలు వినిపించగా, అందులో ప్రధాన నిందితుడు సూరజ్ పంచోలీ కావడం విశేషం.