గురువారం, 25 ఏప్రియల్ 2024
  1. వినోదం
  2. తెలుగు సినిమా
  3. కథనాలు
Written By Raju
Last Modified: హైదరాబాద్ , సోమవారం, 20 మార్చి 2017 (09:01 IST)

ఇంత జరిగాక ఇళయరాజాతో ఎలా మాట్లాడాలి: ఎస్పీ బాలు ఆవేదన

తన పాటలు బహిరంగవేదికలపై, పాటల కచ్చేరీలలో పాడొద్దంటూ ప్రముఖ గాయకుడు, సంగీత దర్శకుడు ఇళయరాజా తన మిత్రుడు బాలసుబ్రహ్మణ్యంకు పంపిన లీగల్ నోటీసుపై నెటిజన్లు మండిపడుతున్నారు. సోషల్ మీడియా ఈ అంశంలో ఎస్పీ బాలసుబ్రమణ్యంకు పూర్తిగా మద్దతునిస్తోంది.

తన పాటలు బహిరంగవేదికలపై, పాటల కచ్చేరీలలో పాడొద్దంటూ ప్రముఖ గాయకుడు, సంగీత దర్శకుడు ఇళయరాజా తన మిత్రుడు బాలసుబ్రహ్మణ్యంకు పంపిన లీగల్ నోటీసుపై నెటిజన్లు మండిపడుతున్నారు. సోషల్ మీడియా ఈ అంశంలో ఎస్పీ బాలసుబ్రమణ్యంకు పూర్తిగా మద్దతునిస్తోంది. దీంతో తనకూ ఆత్మగౌరవం ఉందని, ఇళయరాజా పంపిన నోటీసుకు ఎంతగా ఇష్టం లేనప్పటికీ తానుకూడా చట్టబద్దంగానే స్పందిస్తానని బాలు ప్రకటించారు.
 
ఇళయరాజా తన అమెరికా పర్యటనకు ముందు మాట్లాడటం కానీ, మెయిల్ పంపించడం కానీ చేసి ఉంటే తాను కచ్చితంగా ఆయనతో మాట్లాడి ఉండేవాడినని పేర్కొన్నారు. తనకు లీగల్ నోటీసు వచ్చినపుడు, ఎంతగా ఇష్టం లేకపోయినప్పటికీ, తాను కూడా చట్టబద్ధంగానే స్పందించవలసి ఉంటుందని తెలిపారు. తనకు కూడా ఆత్మ గౌరవం ఉందని పేర్కొన్నారు.
 
నిష్ఫలమైన చర్చను ఇంతటితో ముగించి, ముందుకెళదామని చెప్పారు. అయితే ప్రేక్షకులను సిద్ధం చేయడం కోసమే తాను ఈ సమాచారాన్ని వెల్లడించానని తెలిపారు. తన ప్రియ మిత్రుడైన ఇళయ రాజాకు అసౌకర్యం కలిగించాలని తాను కోరుకోవడం లేదన్నారు. తన స్పాన్సర్లు, ఆర్గనైజర్లు మానసికంగా, ఆర్థికంగా దెబ్బతినాలని తాను కోరుకోవడం లేదని వివరించారు.
 
అమెరికా టూర్‌లో ఉన్న తనకు ఇళయరాజా లీగల్ నోటీసులు పంపించారని సోషల్‌మీడియా ద్వారా ఎస్పీ బాలసుబ్రమణ్యం ప్రకటించిన విషయం తెలిసిందే. బాలు పోస్ట్‌పై నెటిజన్లు భారీగా స్పందిస్తున్నారు. పలువురు బాలుకు మద్దతిస్తుండగా.. మరికొందరు విమర్శిస్తున్నారు. ‘ఇళయరాజాతో మీరు మాట్లాడి సమస్యను సామరస్యంగా పరిష్కరించుకోవచ్చు కదా’ అని కొంతమంది సలహాలిస్తున్నారు. తన పోస్ట్‌కు భారీగా ఇలాంటి కామెంట్లు రావడంతో బాలు రిప్లయ్ ఇచ్చారు.