గురువారం, 25 ఏప్రియల్ 2024
  1. వినోదం
  2. తెలుగు సినిమా
  3. కథనాలు
Written By Selvi
Last Updated : శుక్రవారం, 5 ఫిబ్రవరి 2016 (15:17 IST)

స్పీడున్నోడు రివ్యూ రిపోర్ట్.. రొమాంటిక్ కామెడీ.. యావరేజ్ సినిమా.. తమన్నా సాంగ్ హైలైట్!

నటీనటులు : బెల్లంకొండ సాయి శ్రీనివాస్, సోనారికా భడోరియా, ప్రకాష్ రాజ్, తమన్నా భాటియా, పోసాని కృష్ణమురళి తదితరులు. 
దర్శకత్వం : భీమనేని శ్రీనివాస్ రావు 
సంగీతం : డీజే వసంత్ 
ప్రొడక్షన్ : గుడ్ విల్ సినిమా  
 
దర్శకుడు భీమనేని శ్రీనివాసరావు దర్శకత్వం వహించిన సినిమా ''స్పీడున్నోడు''. బెల్లంకొండ శ్రీనివాస్, సోనారిక భడోరియా హీరోహీరోయిన్లుగా నటిస్తున్న ఈ సినిమాపై మిశ్రమ ఫలితాలు వస్తున్నాయి. స్పీడున్నోడు రొమాంటిక్ కామెడీ ఫిలిమ్‌గా ప్రేక్షకుల ముందుకు వచ్చింది. 2012లో తమిళంలో రిలీజైన సుందరపాండియన్‌కు ఇది రీమేక్. నెటివిటీకి తగ్గట్టు కథలో మార్పులు చేసి తెరపైకి వచ్చింది.  
 
యావరేజ్ సినిమాగా మార్కులు కొట్టేసిన స్పీడున్నోడు.. ఫస్ట్ హాఫ్‌లో మాస్‌ను బాగా ఎంటర్‌టైన్ చేసింది. సెకండ్ హాఫ్‌తో ఫ్యామిలీ ఫ్రెండ్స్‌ను ఆకట్టుకున్నాడు. స్పీడున్నోడుగా బెల్లంకొండ యాక్షన్ బెటర్. అల్లుడు శీను కంటే ఈ చిత్రంలో బాగా యాక్ట్ చేశాడు. గుడ్ విల్ సినిమా బ్యానర్‌పై ఈ సినిమా తెరకెక్కింది. అన్ని వర్గాల ప్రేక్షకులను ఆకట్టుకున్నాడు. ఇంకా స్పీడున్నోడు పవర్ ఫుల్ డైలాగ్స్‌ ప్రేక్షకులతో చప్పట్లు కొట్టించాడు.
 
రీమేక్ సినిమాలు తీయటంలో స్పెషలిస్ట్గా పేరున్న భీమినేని మరోసారి తన మార్కేంటో చూపించాడు. తమిళ కథను తీసుకున్నామని ఎక్కడా బయటపడకుండా నేటివిటీకి తగ్గట్టు తెరకెక్కించాడు. తొలిసారిగా నిర్మాణ బాధ్యతలు కూడా తీసుకున్న భీమినేని ఆ రంగంలోనూ సక్సెస్ సాధించాడు. ఎక్కడా కాంప్రమైజ్ కాకుండా భారీ బడ్జెట్తో స్పీడున్నోడు సినిమాను తెరకెక్కించాడు. డిజె వసంత్ సంగీతం పర్వాలేదు. 
 
చాలా సన్నివేశాల్లో నేపధ్య సంగీతం ఆకట్టుకుంది. విజయ్ సినిమాటోగ్రఫి చాలా బాగుంది. ప్రతి ఫ్రేము రిచ్‌గా రావటం కోసం విజయ్ తీసుకున్న కేర్ స్పష్టంగా కనిపించింది. గౌతంరాజు ఎడిటింగ్‌లో ఇంకాస్త జాగ్రత్తగా వర్క్ చేసి ఉంటే బాగుండేది. తమన్నా స్పెషల్ సాంగ్ ఆకట్టుకుంది. 
 
ప్లస్ పాయింట్స్ 
మెయిన్ స్టోరి
క్లైమాక్స్
తమన్నా స్పెషల్ సాంగ్
 
మైనస్ పాయింట్స్ 
స్లో నేరేషన్
పాటలు
 
రేటింగ్ : 2.5