Widgets Magazine Widgets Magazine
Widgets Magazine

చెర్రీ నాకు మంచి ఫ్రెండ్.. శ్రీమంతుడు చూసి చెర్రీ ఒక్కడే అభినందించాడు: మహేష్ బాబు

గురువారం, 13 ఏప్రియల్ 2017 (18:10 IST)

Widgets Magazine

టాలీవుడ్ సూపర్ స్టార్ మహేష్ బాబు చెర్రీతో తనకున్న అనుబంధాన్ని చెప్పుకొచ్చాడు.  సూపర్ స్టార్ మహేష్ బాబు నటిస్తున్న 'స్పైడర్‌' చిత్రాన్ని తమిళ దర్శకుడు మురుగదాస్‌ తెలుగు, తమిళ భాషల్లో ఒకేసారి తెరకెక్కిస్తున్నాడు. ఈ చిత్ర షూటింగ్‌ దాదాపు పూర్తి కావొచ్చింది. తాజాగా ఈ చిత్ర ఫస్ట్‌లుక్‌, టైటిల్‌ను విడుదల చేశారు. ఈ ఫస్ట్ లుక్‌కు ప్రేక్షకుడి నుంచి మంచి రెస్పాన్స్ వస్తోంది. 
 
ఈ సందర్భంగా తమిళ మీడియాతో మాట్లాడిన మహేష్ బాబు ఆసక్తికర కామెంట్స్ చేశాడు. ఈ సందర్భంగా చిరంజీవి, రామ్‌ చరణ్‌ల గురించి ఆసక్తికర వ్యాఖ్యలు చేశాడు. మెగా ఫ్యాన్స్- ప్రిన్స్ ఫ్యాన్స్‌ మధ్య వస్తున్న తగాదాలపై కూడా స్పందించాడు. 
 
అభిమానుల మధ్య ఇంత గొడవ జరిగినా కూడా హీరోలు మాత్రం చాలా క్లోజ్‌గా ఉంటారు. మహేష్‌ స్వయంగా చిరంజీవి తనకు చాలా దగ్గరి వ్యక్తి, రామ్‌ చరణ్‌ కూడా బాగా క్లోజ్‌ అంటూ చెర్రీ, మహేష్‌ల స్నేహం గురించి చెప్పాడు. గతంలో చెర్రీ ఫ్యామిలీ, ప్రిన్స్ ఫ్యామిలీ విదేశీ టూర్ వేసిన సంగతి తెలిసిందే. అంతేకాకుండా మహేష్‌ 'శ్రీమంతుడు' చిత్రాన్ని చూసి కేవలం తనను రామ్‌ చరణ్‌ ఒక్కడు మాత్రమే అభినందించాడని మహేష్ చెప్పాడు. 
 
ఇదిలా ఉంటే.. 'స్పైడర్' ఇప్పటికే 80 శాతం వరకు షూటింగ్ పూర్తి చేసుకుంది. ఓ వైపు షూటింగ్ కొనసాగుతుండగానే, బిజినెస్‌ను కూడా స్టార్ట్ చేసింది సినిమా యూనిట్. రూ.100 కోట్ల బడ్జెట్‌తో తెరకెక్కుతున్న ఈ సినిమా రూ.150 కోట్ల వరకు బిజినెస్ చేసే అవకాశాలున్నాయిని చెప్తున్నారు.Widgets Magazine
Widgets Magazine
Widgets Magazine
దీనిపై మరింత చదవండి :  

Loading comments ...

తెలుగు సినిమా

news

కొబ్బరిమట్ట సాంగ్ ట్రైలర్ రిలీజ్.. సంపూ.. అదరగొట్టేశాడు (వీడియో)

సోషల్ మీడియా, కామెడీ హీరో.. సంపూర్ణేష్ బాబు.. తాజా చిత్రం కొబ్బరి మట్ట సాంగ్ ట్రైలర్ ...

news

శ్రుతిహాసన్ ఫాలోయర్స్ @5మిలియన్లు.. థ్యాంక్స్ చెప్పిన కాటమరాయుడు హీరోయిన్

కాటమరాయుడు సినిమాలో నటించిన గబ్బర్ సింగ్ హీరోయిన్ శ్రుతిహాసన్‌కు సోషల్ మీడియాలో మస్తు ...

news

సంజయ్ దత్‌ బయోపిక్‌లో రణ్‌బీర్.. ఫోటోలు లీక్.. అచ్చం మున్నాభాయ్‌లా?

బాలీవుడ్ నటుడు సంజయ్ దత్ బయోపిక్ రూపుదిద్దుకునేందుకు రంగం సిద్ధం అవుతోంది. ఈ సినిమాకు ...

news

ఆఫర్ల కోసం పడక గదుల్లోకి దూరే టైపు నాది కాదు.. ఆ డైరక్టర్ మోసం చేశాడు : ఇలియానా

రంగుల ప్రపంచంలోకి అడుగుపెట్టిన తర్వాత సినీ ఆఫర్ల కోసం ఎంతకైనా దిగజారుతారని, ముఖ్యంగా.. ...