శనివారం, 20 ఏప్రియల్ 2024
  1. వినోదం
  2. తెలుగు సినిమా
  3. కథనాలు
Written By DV
Last Modified: బుధవారం, 1 జులై 2015 (19:54 IST)

శ్రద్ధ దాస్‌పై వీడియో...

'రేయ్‌' సినిమాలో నెగటివ్‌ షేడ్స్‌ పాత్రలో నటించిన శ్రద్ధ దాస్‌ మరోసారి నెగటివ్‌ షేడ్స్‌ ఉన్న పాత్రలో చేసిన సినిమా 'సూపర్‌ స్టార్‌ కిడ్నాప్‌'. ఈ శుక్రవారమే ప్రేక్షకుల ముందుకు రానుంది. దాంతో ఈ రోజు నుంచి ఈ సినిమాకి సంబంధించిన ప్రమోషన్స్‌లో బిజీ కానుంది శ్రద్ధ దాస్‌. ఇందులో ఆమె చేసింది చిన్న పాత్రే అయినా సినిమాకి చాలా కీలకం అని అంటున్నారు. 
 
ఒకవైపు సూపర్‌ స్టార్‌ కిడ్నాప్‌ సినిమా ప్రమోషన్స్‌లో బిజీగా ఉంటూనే, తదుపరి చిత్రం ప్రమోషనల్‌ వీడియో షూటింగ్‌లో కూడా పాల్గొంటోంది. ఆమె 'గుంటూరు టాకీస్‌' చిత్రం ప్రమోషనల్‌ వీడియోలో నటించనుంది. దీనిని గురువారం నుంచి షూట్‌ చేయనున్నారు. ఇది కాకుండా శ్రద్ధ దాస్‌ హిందీలో 'హంటింగ్‌ ఆఫ్‌ బాంబే మిల్స్‌' అనే సినిమా కూడా చేస్తోంది.