శుక్రవారం, 29 మార్చి 2024
  1. వినోదం
  2. తెలుగు సినిమా
  3. కథనాలు
Written By pnr
Last Updated : సోమవారం, 5 మార్చి 2018 (15:53 IST)

భర్త చెప్పాడని శ్రీదేవి అలా చేసింది.. తట్టుకోలేక పోయా.. కుమిలి ఏడ్చాను : అరవింద్

అందాల నటి శ్రీదేవి హఠాన్మరణం చిత్ర రంగానికి చెందిన ఓ ఒక్కరూ జీర్ణించుకోలేక పోతున్నారు. ముఖ్యంగా, టాలీవుడ్‌కు చెందిన బడా నిర్మాతల్లో ఒకరైన అల్లు అరవింద్ మరింత బాధపడుతున్నారు.

అందాల నటి శ్రీదేవి హఠాన్మరణం చిత్ర రంగానికి చెందిన ఓ ఒక్కరూ జీర్ణించుకోలేక పోతున్నారు. ముఖ్యంగా, టాలీవుడ్‌కు చెందిన బడా నిర్మాతల్లో ఒకరైన అల్లు అరవింద్ మరింత బాధపడుతున్నారు. తాజాగా హైదరాబాద్‌ బంజారాహిల్స్‌లోని పార్క్ హయత్ హోటల్‌లో లెజండరీ నటి శ్రీదేవికి నివాళులు ఆర్పిస్తూ.. టాలీవుడ్ చిత్ర పరిశ్రమ సంతాప సభను నిర్వహించింది. కళాబంధు టి. సుబ్బరామిరెడ్డి ఆధ్వర్యంలో జరిగిన ఈ కార్యక్రమంలో హాజరైన నటీనటులు.. నటి శ్రీదేవితో తమకున్న అనుభవం పంచుకున్నారు.
 
ఈ సందర్భంగా అల్లు అరవింద్ మాట్లాడుతూ, శ్రీదేవితో తనకు రెండు సినిమాల పరిచయం ఉంది. ఒకటి అశ్వనీదత్‌ నిర్మించిన "జగదేకవీరుడు అతిలోకసుందరి". మరొకటి "ఎస్పీ పరశురాం". ఆమె గొప్పతనం గురించి చెప్పడానికి నా దగ్గర నా హృదయం దహించి వేసే జ్ఞాపకం ఉంది. బోనీకపూర్ నాకు స్నేహితుడు. పెళ్లి తర్వాత బోనీకి ఫోన్ చేస్తే ఇంటికి రమ్మనాడు. ఇంటికెళ్లాను. ఓకుర్రాడు టీ తీసుకొచ్చాడు. శ్రీదేవి ఆ కుర్రాడి వెనుకే వచ్చి ఆ కప్పు తీసుకుని నా చేతుల్లో పెడుతుంటే.. ఆశ్చర్యపోయా. నా మనసులో ఆవిడకున్న స్థాయివేరు. మనకి దేవత. భర్త చెప్పాడని ఓ గృహిణిగా ఆమె కప్పు అందించడం మనసు అస్సలు తట్టుకోలేకపోయింది. లోపల ఏడ్చానని చెప్పుకొచ్చారు. 
 
నేను ఎంత పెద్ద నిర్మాతని అయినా.. నా మనసులో ఆమెకున్న స్థాయికి ఆమె టీ కప్పు మనకి ఇవ్వడం తట్టుకోలేకపోయా. అంతటి స్థానం ఆమె సంపాదించుకున్నారు. మొన్న రాంగోపాల్‌ వర్మ రాసిన ఉత్తరం చదివా. ఆయన గురించి రకరకాలుగా అనుకుంటుంటారు. శ్రీదేవి గురించి ఆయన రాసిన ఆ ఉత్తరం అత్యద్భుతంగా ఉంది. వర్మ హృదయం అప్పుడర్ధమైందని తెలిపారు.