శనివారం, 20 ఏప్రియల్ 2024
  1. వినోదం
  2. తెలుగు సినిమా
  3. కథనాలు
Written By Selvi
Last Updated : శనివారం, 3 అక్టోబరు 2015 (13:41 IST)

శ్రీదేవి చిన్న కూతురు ఖుషి హంగామా: పాప్ సింగర్ని కిస్ చేస్తూ..!

శ్రీదేవి చిన్న కూతురి హంగామా అంతా ఇంతా కాదు. చిట్టిపొట్టి డ్రెస్‌లు వేసుకుంటూ బాగానే బట్టల పొదుపు పాటిస్తోంది. తాజాగా పాప్ సింగర్ జాక్ గిలిన్ స్కైని ముద్దాడి ఆ ఫోటోను సోషల్ మీడియాలో పోస్ట్ చేసింది. పాప్‌ సాంగ్స్ అంటే చెవి కోసుకునే ఈ చిన్నది అక్క జాహ్నవి కపూర్‌‌ని కూడా మించిపోయింది ఎప్పుడూ తన హాట్ ఫోటోలతో సోషల్ సైట్లో హీటును పెంచే ఈ చిన్నది ఇప్పుడీ ముద్దు ఫోటోతో మరింత పాపులర్‌ అయ్యింది. 
 
ఈ ముద్దు వ్యవహారం చూసినవాళ్లు ముక్కున వేలేసుకుంటున్నారు చిన్న కూతురు ఇంత పెద్ద పని చేసిందేంటి అంటూ ఆశ్చర్య పోయారు. మొత్తానికి శ్రీదేవి కూతుళ్లు ఇండస్ట్రీ బుద్దులు బాగా అబ్బినట్లే.. ఇక హీరోయిన్లుగా రావడమే తరువాయి అని సినీ పండితులు అంటున్నారు.
 
కాగా శ్రీదేవి తాజాగా పులి సినిమాలో నటించిన సంగతి తెలిసిందే. శ్రీదేవికి ఇద్దరు కుమార్తెలు. పెద్దమ్మాయి పేరు జాహ్నవి చిన్నకూతురు పేరు ఖుషి. శ్రీదేవి చిన్న కూతురు ఖుషి అందరికీ తెలియకపోయినా.. నెటిజన్లకు ఆమె మాత్రం బాగా తెలుసు. పెద్ద కూతురు జాహ్నవి పబ్, క్లబ్ లంటూ తిరుగుతుండగా చిన్న కూతురు నేనేమన్నా తక్కువ తిన్నానా అంటూ పాప్ సింగర్‌ను ముద్దాడి వార్తల్లో నిలిచింది.