Widgets Magazine Widgets Magazine
Widgets Magazine

టీవీ లైవ్‌లో బోరున విలపించిన శ్రీదేవి... వీడియో

సోమవారం, 10 జులై 2017 (14:44 IST)

Widgets Magazine
sridevi

'అతిలోక సుందరి' శ్రీదేవి టీవీ లైవ్‌షోలో బోరున విలపించింది. ఈనెల ఏడో తేదీనతో వెండితెర అరంగేట్రం చేసి అర శతాబ్దాన్ని పూర్తి చేసుకుంది. ఈ సందర్భంగా ఆమె నటించిన తాజా చిత్రం "మామ్" అదే రోజున విడుదల చేశారు. బాక్సాఫీస్ వద్ద ఆ సినిమాను ప్రేక్షకులు ఆదరిస్తున్నారు. ఆసాంతం భావోద్వేగాలతో సాగే ఆ సినిమాలో శ్రీదేవి అసాధారణ నటనను కనబరిచారంటూ ప్రేక్షకులు ప్రశంసల వర్షం కురిపిస్తున్నారు. అదేసమయంలో చిత్రం హిట్ కావడంతో చిత్ర యూనిట్ ప్రమోషన్ కార్యక్రమాలను నిర్వహిస్తోంది. ఈ సందర్భంగా శ్రీదేవి తీవ్రమైన భావోద్వేగానికి గురయ్యారు. లైవ్‌లోనే బోరున విలపించారు.
 
ఈ సందర్భంగా శ్రీదేవి మాట్లాడుతూ... 'సాజల్.. నా తల్లి ఐ లవ్యూ. నేను ఎందుకు ఇంతలా ఉద్వేగానికి గురవుతున్నానో అర్థం కావట్లేదు. సాజల్, అద్నాన్ లేకుండా ఇంత మంచి సినిమా సాధ్యమయ్యేదే కాదు. ఇంత మంచి విజయం సాధించి ప్రమోషన్లు నిర్వహిస్తున్న సందర్భంలో మీరు లేకపోవడం చాలా బాధిస్తోంది. మిమ్మల్ని మిస్సవుతున్నాను. సాజల్ నువ్వు ఈ సినిమాలో నటించిన తీరు నిజంగా అద్భుతం. నువ్వులేని ఈ సినిమా నిజంగా అసంపూర్ణం. ఈ క్షణం చాలా ప్రత్యేకమైనది. దీనికోసమే అంతా చూస్తున్నాం' అంటూ శ్రీదేవి కన్నీటి పర్యంతమయ్యారు. ఆ వీడియోను ఓ అభిమాని యూట్యూబ్‌లో అప్‌లోడ్ చేశారు.
 
సాజల్‌తో శ్రీదేవి అంతలా కనెక్ట్ కావడానికి ఓ కారణం ఉంది. మామ్ చిత్రంలో సాజల్.. శ్రీదేవి కుమార్తెగా నటించింది. షూటింగ్‌లో అత్యంత చేరువైన సాజల్ అలీతో.. శ్రీదేవి అమ్మకన్నా ఎక్కువైన బంధాన్నే ఏర్పరచుకుందట. కానీ, ఈ చిత్రం ప్రమోషన్లలో యూనిట్ అంతా పాల్గొంటున్నా.. సినిమాలో భాగమైన సాజల్ అలీ, పాకిస్థాన్‌కు చెందిన మరో నటుడు అద్నాన్ సిద్ధిఖీ హాజరు కాలేకపోయారు. అదే శ్రీదేవిని బాధపెట్టిందట. ఈ విషయాన్నే శ్రీదేవి వెల్లడిస్తూ బోరున విలపించింది. Widgets Magazine
Widgets Magazine
Widgets Magazine
దీనిపై మరింత చదవండి :  

Loading comments ...

తెలుగు సినిమా

news

మహాదేవుడి లాంటి భర్త లభించాలంటే.. 16 సోమవారాలు వ్రతమాచరించాలి..

మహాదేవుడు.. ముక్కంటి... పరమేశ్వరుడు.. ఈశ్వరుడు... అంటూ పలు నామాల్లో పిలువబడే ఆదిదేవుడు ...

news

పిచ్చెక్కిస్తోన్న శివాని... అదొక్కటే నమ్ముకుంటే దెబ్బతింటావని చెప్పా... రాజశేఖర్

సినీ ఇండస్ట్రీలో ఇప్పుడిప్పుడే వారసురాళ్లు కూడా వచ్చేస్తున్నారు. ఇప్పటికే మెగా బ్రదర్ ...

news

రజనీకాంత్ రాజకీయాల్లోకి రావాలి.. నాకు మగపిల్లాడు పుడితే?: శ్రుతి హాసన్

తమిళ సూపర్ స్టార్ రజనీకాంత్ రాజకీయ ప్రవేశంపై.. సినీ లెజెండ్ కమల్ హాసన్ వివాదాస్పద ...

news

లవ్ ప్రపోజ్ చేసిన అబ్బాయిని హర్ట్ చేసి ఫ్రెండ్‌షిప్‌ కట్ చేశా : నటి మాధవీలత

మాధవీలత. కర్ణాటక రాష్ట్రం నుంచి టాలీవుడ్‌లోకి అడుగుపెట్టిన అమ్మాయి. నచ్చావులే చిత్రంతో ...

Widgets Magazine