గురువారం, 28 మార్చి 2024
  1. వినోదం
  2. తెలుగు సినిమా
  3. కథనాలు
Written By Selvi
Last Updated : గురువారం, 3 సెప్టెంబరు 2015 (13:04 IST)

గబ్బర్ సింగ్, మగధీర, ఈగ లైఫ్-టైమ్ రికార్డుల్ని బ్రేక్ చేసిన శ్రీమంతుడు!

మహేష్ బాబు శ్రీమంతుడు గబ్బర్ సింగ్, మగధీర, ఈగ లైఫ్ టైమ్ రికార్డులను బ్రేక్ చేశాడు. ఈ సినిమా రిలీజైన 9 రోజులకే వంద కోట్ల క్లబ్‌లో శ్రీమంతుడు చేరిన సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో శ్రీమంతుడు తెలుగు చిత్ర సీమలోని లైఫ్ టైమ్ రికార్డుల్ని అధిగమించాడు. శ్రీమంతుడు విడుదలైన 26 రోజుల్లో 160 కోట్ల కలెక్షన్స్ చవిచూశాయి.

తద్వారా పవన్ కల్యాణ్ గబ్బర్ సింగ్ (150కోట్లు), ఈగ (125 కోట్లు), మగధీర (150 కోట్లు) లైఫ్ టైమ్ రికార్డులను బద్ధలు కొట్టాడు. అయితే అత్తారింటికి దారేది సినిమా రికార్డును శ్రీమంతుడు (రూ.187 కోట్లు) బ్రేక్ చేస్తాడా లేదా అనేది తేలాలంటే ఇంకా టైమ్ కావాల్సిందేనని శ్రీమంతుడు యూనిట్ వెల్లడించింది. 
 
ఇకపోతే.. మహేష్ బాబు, శృతిహాసన్ జంటగా కొరటాల శివ దర్శకత్వంలో రూపొందిన చిత్రం ‘శ్రీమంతుడు'. మైత్రి మూవీ మేకర్స్‌, ఎం.బి.ఎంటర్‌టైన్‌మెంట్స్‌ ప్రై.లి. బ్యానర్స్‌‌పై తెరకెక్కిన ఈ సినిమా ప్రపంచ వ్యాప్తంగా ఆగస్ట్ 7న విడుదలైంది. జగపతిబాబు, రాజేంద్రప్రసాద్‌, అలీ, సుబ్బరాజు, వెన్నెల కిషోర్‌, శివాజీ రాజా, కాదంబరి, ముకేష్‌ రుషి, సంపత్‌, హరీష్‌, ఏడిద శ్రీరాం, తులసి, సుకన్య, సీతారాం, సన తదితరులు ఇందులో కీలక పాత్ర పోషించారు.